Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Journalist Family: ఆదర్శవంతంగా జర్నలిస్టు కుటుంబం

— బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్ అవయవాలు దానం
— మరో నలుగురికి కొత్త జీవితం ప్రసాదించిన కుటుంబం

ప్రజా దీవెన, విశాఖపట్నం : సమా జహితం కోసం నిరంతరం అన్యా యాలు, అక్రమాలు మంచి చెడుల కోసం వార్తలను వెలుగులోకి తీసు కొస్తూ ప్రజలను మేల్కొల్పే జర్న లిస్టు మరణించి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు. తన కథనాల ద్వారా సమాజంలోని అపోహలను పోగొట్టే జర్నలిస్టు తన మరణంతో అవయవాలను దానం చేసి ప్రజల్లో ఉన్న అపోహల ను తొలగించేందుకు ప్రయత్నిం చారు. ఇంటి పెద్దను కోల్పోయిన జర్నలిస్టు కుటుంబం మరో నాలు గు కుటుంబాల జీవితాల్లో వెలుగు లు నింపేందుకు ముందుకు వచ్చి సమాజంలో అందరికీ స్ఫూర్తిదా యకమయ్యారు.సింహాచలం ప్రాంతంలో పలు పత్రికల్లో జర్న లిస్టుగా పనిచేసిన మురళీ కృష్ణ (52) ఈ నెల 14వ తేదీన ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద జారి పడటంతో స్పృహ కోల్పోయరు.. తీవ్రంగా బ్రెయిన్ లో రక్తస్రావం జరగడం వలన దగ్గరలో ఉన్న కిమ్స్ ఐకాన్ హాస్పి ట‌ల్‌కి త‌ర‌లించారు. అత‌న్ని ర‌క్షిం చ‌డానికి రెండు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్ర‌మించారు. అయినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించటంతో మంగళవారం బ్రెయిన్ డెడ్ అయి నట్లుగా వైద్యులు ప్రకటించారు.

ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై వైద్య బృందం వారి కుటుంబ స‌భ్యులు భార్య‌, , కుమార్తె, కుమారుడు, బంధువుల‌కు అవ‌గాహ‌న‌ క‌ల్పిం చిన అనంత‌రం వారి అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుకు సమాచారం ఇవ్వగా ఆయన అవయవాలు సేకరించేం దుకు అనుమతులను జారీ చేశా రు. మురళి నుంచి రెండు కిడ్నీలు (మూత్ర‌పిండాలు), కాలేయమూ, గుండె వైద్య బృందం సేకరించింది. సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం సీనియార్టీ జాబితాను అనుసరించి అవయవా లను కేటాయించడం జరిగింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన నగర పోలీ స్ శాఖ సహకారంతో అవయవా లను ఇతర ఆస్పత్రికి తరలించా రు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నం ఆర్డీవో, రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ కే రాంబా బు ఆస్పత్రికి చేరుకొని మురళీకృష్ణ పార్థవదేహానికి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం కుటుంబ స భ్యులకు మురళీకృష్ణ అంతక్రి యలకు రూ. 10 వేలు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. చ‌నిపోతూ మ‌రో నలుగురు జీవితాల్లో వెలు గులు నింపినందుకు గ‌ర్వంగా ఉం ద‌ని మృతిని కుటుంబ స‌భ్యులు తెలిపారు. స్థానిక ప్ర‌జ‌లు వారి కు టుంబ స‌భ్యుల‌ను అభినందించా రు.

అపోహలు వీడి అవయవ దానం చేయాలి… అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా ప్రజల్లో ఏదో తెలియని అపోహ ఉంది.. తద్వారా బ్రెయిన్ డెడ్ అయినా సరే అవయవాలు దానం చేసేం దుకు ముందుకు రావడం లేదు.. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అవయవాల కోసం ఎదురు చూసే వారి సంఖ్య పెరుగుతుంది.. మురళీ కుటుంబ సభ్యుల వలె ప్రతి ఒక్కరూ అపోహలను వీడి అవయవాల కోసం ఎదురుచూసే మరికొందరికి అవయవ దానం చేసి వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపేందుకు ముందుకు రావాలి. . అవయవ దానం కు ముందుకు వచ్చిన మురళి కుటుంబ సభ్యు లతో పాటు వారిని ప్రోత్సహించిన వైద్య బృందం అవయవాలు తర లించేందుకు సహకరించిన పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు.
–డాక్టర్ కె రాంబాబు, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్