Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:27 am Posted by : praja deveena

Cashless Health Cards for Journalists : జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

–ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నే జర్నలిస్టులు సైతం సేవలo దిస్తున్నారు
— పోస్టు కార్డు ఉద్యమ కార్య క్రమంలో టియుడబ్ల్యూజే143 అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

Cashless Health Cards for Journalists : ప్రజా దీవెన, నల్లగొండ: అక్రిడి టేషన్ అర్హత కలిగిన జర్నలిస్టు లందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న మాదిరి క్యాష్ లెస్ హెల్త్ కార్డుల మంజూరు చేయ డంతో పాటు జర్నలిస్టుల న్యా యమైన సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 రోజులపాటు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టా లని యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు అల్లం నారాయణ, ప్రధాన కా ర్యదర్శి అస్కాని మారుతీ సాగర్ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామ గిరి చౌరస్తాలో ఉన్న గాంధీ జీ వి గ్రహం వద్ద కార్యక్రమం నిర్వ హిం చారు.

ముందుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివ చ్చిన జర్నలిస్టులు ర్యాలీగా గాంధీ వి గ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్ర హానికి పూలమాల వేసి నివాళు లు అర్పించారు. జర్నలిస్టుల స మస్యలను పరిష్కరించాలని, ప్ర భుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశా రు.అనంతరం ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డికి పో స్టుకార్డుల ద్వారా తమ డిమాం డ్లను తెలియజేసేలా ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్ర తి జర్నలిస్టు పోస్టుకార్డుపై తమ సమస్యలు, డిమాండ్లను రాసి ముఖ్యమంత్రికి చేరేలా కార్యక్ర మాన్ని కొన సాగించాలని పిలు పునిచ్చారు. జర్నలిస్టుల సంక్షే మం, భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసు కోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ను అమలు చేసేది అధికారులైతే అంతకు మించిన సేవలను అంది స్తూ జర్నలిస్టులు సైతం ఆ పథ కాలను ప్రజలకు తె లియజేయ డంలో సేవలు అందిస్తున్నట్లు తె లిపారు.

లక్షల్లో వేతనాలు ఇవ్వ డంతో పాటు రిటైర్డ్ మెంటు బెన్ఫి ట్స్ అందిస్తూ క్యాష్ లెస్ హెల్త్ కార్డు లు ఉద్యోగులకు ఇచ్చినటు వం టి ప్రభుత్వం అదే స్థాయిలో సే వ లు అందిస్తున్న జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చే శారు. వృత్తిలో నిమగ్నమై నేడు అనేకమంది జర్నలిస్టులు అనా రోగ్యం పాలవుతున్న నేపథ్యంలో డబ్బులు లేక చికిత్స చేయించు కోలేక మరణిస్తున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నట్లు ఆవే దన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉ న్నటువంటి హెల్త్ కార్డులు ఒక్క నిమ్స్ ఆస్పత్రిలోనే పనిచేస్తున్నా యని ఆ పద్ధతిని మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ ఆసు పత్రుల్లో పనిచేసే విధంగా జీవో జారీ చేసి క్యాష్ లెస్ హెల్త్ కార్డు లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.

ఈ సంద ర్భంగా జర్నలిస్టులు పో స్టుకార్డు లపై క్యాసెలెస్ హెల్త్ కా ర్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరు రాసి స్థానిక తపాలా కా ర్యాలయం ద్వారా సీఎంలోకి పం పించడం జరిగింది.ప్రభుత్వం వెం టనే స్పందించి జర్నలి స్టుల న్యాయపరమైన డిమాండ్లను నె రవేర్చాలని యూనియన్ నాయ కులు డిమాండ్ చేశారు. లేని ప క్షంలో ఉద్యమాన్ని ఉదృతం చే స్తామని అన్నారు.

ఈ కార్యక్ర మంలో యూనియన్ రాష్ట్ర నా యకులు గోలి విజయ్ కుమార్, నకిరేకంటి శ్రీనివాస్ గౌ డ్, నీలం వెంకట మధు, సల్వాది జానయ్య, ముచర్ల విజయ్, ఆ కాష్, ముచర్ల శ్రీనివాస్, నర్సింగ రావు, లక్ష్మీనారాయణ, జానీ, పోగుల రమేష్ గౌడ్, బొడ్డుపల్లి రామ కృష్ణ, చిక్కుల యాదగిరి, పేరం సుభాష్, వెంకన్న, శ్రీనివా స్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.