Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 1:05 am Posted by : praja deveena

JubileehillsElectionsResult : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్, మధ్యాహ్నం వరకు తుదిఫలితం

బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ సినిమా రి లీజ్ కు కౌంట్ డౌన్, మధ్యాహ్నం వరకు తుది ఫలితం

JubileehillsElectionsResult: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యా ప్త దృష్టిని ఆకర్షించడంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆస క్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లె క్కింపునకు అంతా సిద్ధమైంది. కౌంటింగ్ కు సంబం ధించి అధికా రు లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం తెల్లవా రు జామున 5 గంటలకే అభ్యర్థుల స మక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, రి టర్నింగ్ అధికారి స్ట్రాంగ్ రూమ్ త లుపులు తెరిచి లోపలికి వెళ్ళారు. ఈవీ ఎంలపై ఉండే సీళ్లు, ఇతరత్రా భద్రతా ఏర్పాట్లను సరిచూసుకుని అంతా సవ్యంగా ఉందని నిర్ధారిం చుకున్న తర్వాతే ఓట్ల లెక్కింపు ప్ర క్రియను మొదలు పెట్టేందుకు రం గం సిద్ధం చేసుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం 8గంటలకు యూసుఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం డీ ఆర్సీ సెంటర్లో పోస్టల్బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి లో మొత్తం 407 పోలింగ్ కేంద్రా ల కు సంబంధించిన ఓట్లను లెక్కిం చ నున్నారు. ఎన్నికల బరిలో 58 మం ది అభ్యర్థులు నిలిచారు. ప్రధాన రా జకీయ పార్టీలైన కాం గ్రెస్ నుంచి న వీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లం కల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవ ర్గంలో మొత్తం 4,01, 3 65 మంది ఓటర్లు ఉండగా 48.49 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైం ది. మొత్తం ఏడు డివిజన్లలో 1,94, 631 ఓట్లు పోలయ్యాయి.

బోరబండ డివిజన్ లో అత్యధికం గా 55.92శాతం, అత్యల్పంగా సో మాజిగూడ డివిజన్ లో 41.99 శా తం ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు నకు మొత్తం 42 టేబుళ్లను ఏర్పా టు చేశారు. 10 రౌండ్ల లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. కౌంటింగ్ కు మొత్తం 186 మం ది సిబ్బందిని కే టాయించారు. మధ్యాహ్నం 12గం టల వరకు తు ది ఫలితం వచ్చే అవ కాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫలితాలను ఎప్పటికప్పు డు ఈసీ వెబ్సైట్ లో నమోదు చే సేందు కు చర్యలు చేపట్టినట్లు వెల్ల డించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీ డి యా కోసం ప్రత్యేకంగా ఎల్ ఈడీ స్క్రీన్ఏర్పాటు చేయనున్నారు.

రౌండ్ రౌండ్ కు 45 నిమిషాల సమయం... ఓట్ల లెక్కింపు సంద ర్భంగా ఒక్కోరౌండ్ కు 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉం ది. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధి కా రులకు గురువారం తుదివిడ త శిక్షణ ఇచ్చారు. వారంతా శుక్రవారం ఉదయమే ఈవీఎంలు భద్ర పర్చిన స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిం చి న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జూబ్లీ హిల్స్ ఉపఉన్నికల లెక్కింపు సంద ర్భంగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టే డియం వద్ద 1 5 ప్లాటూన్ల సిబ్బం దితో పాటు 250 మంది పోలీసుల తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చే శారు ఎన్నికల అధికారులు.