Justice Sanjeev Khanna: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా (Justice Sanjeev Khanna) నియామకమయ్యారు. ఆయనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియామకం చేస్తూ భారత రా ష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వచ్చేనెల 11వ తేదీన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా ప్రమాణస్వీకారం చేయను న్నా రు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా (As Chief Justice) ఉండనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివైచంద్ర చూడ్ వచ్చేనెల 10న పదవీ విర మణ చేయనున్నారు. తన స్థానం లో జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేసిన జస్టిస్ చంద్ర చూడ్.2025 మే 13 వరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా కొనసాగనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్ ‘ లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావాల్ (Arjun Ram Meghawal) వెల్లడించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.