Justin Trudeau : ప్రజా దీవెన, కెనడా: కెనడా ప్రధా నమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో అకస్మా త్తుగా రాజకీయ పరిస్థితులు ఆస క్తికరంగా మారాయి. లిబరల్ పార్టీకి చెందిన 153 మంది ఎంపీల్లో 131 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓ టు వేయడం, పార్టీలో అంతర్గత విభేదాలు రగలడంతో ట్రూడో రాజీ నామా చేయడం అనివార్యమైంది. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, ఈ పరిణా మం కెనడాలో కొత్త నాయకత్వంపై చర్చకు దారితీసింది.ట్రూడో రాజీ నామా తర్వాత, లిబరల్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రేసులో ఇద్దరు భారతీయ సంతతి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒక రు అనితా ఆనంద్, మరొకరు జార్జ్ చాహల్.
అనితా ఆనంద్ ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రి గా వ్యవహరిస్తున్నారు. తమిళనా డు, పంజాబ్‌కు చెందిన భారతీయ వైద్య దంపతుల కుమార్తె అయిన ఆమె, కోవిడ్-19 మహమ్మారి సమ యంలో కీలక భూమిక పోషించా రు. లిబరల్ పార్టీకి ఆమె నాయక త్వం వహించే అవకాశాలపై చర్చ లు జరుగుతున్నాయి. మరోవైపు, సిక్కు కమ్యూనిటీలో ప్రభావం కలి గిన నేత జార్జ్ చాహల్ పేరు కూడా ప్రధానమంత్రి రేసులో ఉంది. అల్బె ర్టాకు చెందిన ఆయన నేచురల్ రీ సోర్సెస్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు.
లిబరల్ పార్టీ తాత్కా లిక నాయకుడిగా చాహల్ నియ మితులయ్యారు. కానీ కెనడా చట్టా ల ప్రకారం తాత్కాలిక నాయకులు ప్రధానమంత్రి పదవి చేపట్టలేరని స్పష్టం కావడంతో చాహల్ ప్రధా నమంత్రి పట్టు సాధించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.జస్టిన్ ట్రూ డో తర్వాతి వారసుడిపై నిశ్చితి కాస్త సమయం పట్టొచ్చు. అనితా ఆనంద్ వంటి అనుభవజ్ఞుల నా యకత్వాన్ని భావించాలనే అభి ప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. మారుతున్న రాజకీయ పరిణా మాలతో కెనడా ప్రజలు, అంత ర్జాతీయ సమాజం కూడా కొత్త నాయకుడి వైపు ఆసక్తిగా ఎదు రుచూస్తున్నారు.