Jyoti Madhubabu : ప్రజా దీవెన, నడిగూడెం : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్తు మాదిగ జాతి రుణపడి ఉంటుందని నడిగూడెం మండల మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు అన్నారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 3ంసంవత్సరాలగా వర్గీకరణకు అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు .
కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించటం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ కమిటీకి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు మాదిగ జాతి అంతయు రుణపడి ఉంటుందని తెలిపారు .
ఉత్తంకుమార్ రెడ్డి కమిటీ చైర్మెన్ గా ఉండటం వలనే ఎస్సీ వర్గీకరణ ఆమోదించటం సాధ్యమైందని తెలిపారు ఎస్సీ వర్గీకరణ బిల్లు క్యాబినెట్లు ఆమోదమైందని తదుపరి అసెంబ్లీ ముందుకు వర్గీకరణ బిల్లు వెళుతుందని ఆమె తెలిపారు