–జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు పొడగింపు
Kalvakuntla Kavitha: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ మళ్ళీ నిరాశే ఎదురవుతోంది. ఆమె జుడీషియల్ కస్టడీని (Judicial Custody)జులై 18 వరకు రౌస్ అవె న్యూ కోర్ట్ పొడగించింది. నేటితో కవిత జ్యూడిషల్ కస్టడీ ముగియ డంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ముం దు అధికారులు హాజరు పరిచారు. కాగా ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసు లో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవి ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తీహార్ జైలులో ప్రశ్నించిన అనంతరం సీబీ ఐ (cbi)అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికం గా సీబీఐ ప్రకటించి, కోర్టుకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే కవిత మరోసారి అరెస్టయినట్టయింది. అటు ఈడీ, ఇటు సీబీఐ అరెస్ట్ (Arrested by CBI)నేపథ్యంలో కవిత చాలా కాలంగా జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆమె చాలా ప్రయత్నాలు చేసినప్ప టికీ ఫలితం దక్కలేదు. ఆమె దాఖ లు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి.కాగా కవితకు బెయిల్ దక్కకపోవడంపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర నిరాశకు గరవుతున్నా యి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమ యంలో క్రియాశీలక నాయకురాలైన కవిత జైలులో ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక కీలక నేతల జంపింగ్‌లతో బీఆర్ఎస్ సతమ తమవుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మె ల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్ప టికే అధికార కాంగ్రెస్ గూటికి చేరా రు. మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో (congress party) చేరడం దాదాపు ఖాయమై నట్టు తెలుస్తోంది.