Kannera of red flags..! ఎర్ర జెండాల కన్నెర్ర..!
-- బిఅర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన పర్యవసానం -- నేడు వామపక్షాల అత్యవసర సమావేశం
ఎర్ర జెండాల కన్నెర్ర..!
— బిఅర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన
పర్యవసానం
— నేడు వామపక్షాల అత్యవసర సమావేశం
ప్రజా దీవెన/ హైదరాబాద్ : పొత్తు అంశం ప్రస్తావన లేకుండానే సీఎం కేసీఆర్ 115 మంది బి ఆర్ ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటనపై ఎర్రజెండాలు కన్నెర్ర చేశాయి. మునుగోడు ఎన్నికల సందర్భంగా వామపక్షాలు గులాబీ పార్టీకి మద్దతు తెలిపిన విషయం విధితమే.
ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ వామపక్ష పార్టీలతో పొత్తు లేదని సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు నేడు అత్యవసర సమావేశం కానున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్ కార్యచరణపై సీపీఐ, సీపీఎం చర్చించనున్నాయి.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో సీపీఐ, సీపీఎం ఉన్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఇరు పక్షాల ముఖ్యనేతలు హాజరవుతున్నట్టు సమాచారం.అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్ కార్యచరణపై భేటీలో చర్చించనున్నారు.