Katta Anantha Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కట్టా అనంత రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గంకు జరి గిన హోరాహోరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టులో నిర్వహిం చిన బార్ అసోసియేషన్ ఎన్నిక లలో అధ్యక్షుడిగా కట్టా అనం త రెడ్డి తన ప్రత్యర్థి సతీష్ పై 16 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా మంద నగేష్ ఆయన ప్రత్యర్థి ఎస్పీ ప్రవీణిపై 22 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
అదే విధంగా ఉపాధ్యక్షులుగా ఎం.నాగిరెడ్డి, పెరుమాళ్ల శేఖర్, జాయింట్ సెక్రటరీగా ఎండీ ఫెరోజ్, కోశాధికారిగా బరిగెల నగేష్, గేమ్స్ సె క్రటరీగా గోసుల నాగార్జున శివ ప్రసాద్, కల్చరల్ సెక్రటరీగా వెంకన్న బొమ్మరగాని, లైబ్రరీ సెక్రటరీగా బి. మధుతో పాటు ఈసీ మెంబర్లను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజును నూతనంగా ఎన్నికైన బార్ అసోసి యేషన్ కార్యవర్గం మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్ మాట్లాడుతూ న్యా యవాదుల సమస్యల పరిష్కారా నికి తమ వంతుగా కృషి చేస్తామ న్నారు. ఎన్నికల ప్రధాన అధికారిగా గుండె వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఎ న్నికల అధికారులుగా సయ్యద్ జమీల్, ఎ.వెంకట్ రెడ్డి వ్యవ హారించారు.