Kaundinya Association of North America: ప్రజా దీవెన చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినే డు గ్రామానికి చెందిన గీత కార్మికు డు కొమ్మగోని శంకరయ్య ఇటీవల తాటి చెట్టుపై నుండి పడి గాయప డ్డాడు. కానా స్థానిక ప్రతినిధి నాతి స్వామి, పొలగొని విజయ్ ల ద్వారా విషయం తెలుసుకున్న కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ట్రస్టు సభ్యులు వేంటనే వారి కుటుంబానికి రూ.10 వేల రూపాయల ఆర్థికసాయాన్ని మం జూరుచేశారు. సదరు ఆర్థిక సహా యాన్ని కానా స్థానిక ప్రతినిధులు నాతి కాటమయ్య, నాతి స్వామి, అంతటి స్వామి, కేజెకెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగుల అచ్చా లు, కేజెకెస్ జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, మండల అధ్యక్షుడు మా విడి హనుమంతు, గ్రామగౌడ సం ఘం అధ్యక్షులు నాతి వెంకట్రామయ్య ల చేతుల మీదుగా బాధితు డు కొమ్మగోని శంకరయ్య కు అం దజేశారు.
ఈ కార్యక్రమంలో పోల గోని విజయ్, డీలర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అంతటి శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతటి సత్తయ్య , అంతటి నరేష్, లోడే మహేష్, కొంపెల్లి అభి, అంత టి అజయ్ తదితరులు పాల్గొన్నా రు. కేజెకెస్ కొండా వెంకన్న మాట్లా డుతూ కానా చేస్తున్న సేవలను కొనియాడుతూ గత 3 సంవత్స రాలుగా గీతన్నలను చైతన్య పరు స్తూ తపాలా భీమాని వినియోగిం చుకోవాలన్న పిలుపు మేరకు సం ఘాల వారిగా ముందుకు వచ్చిన గీతన్నలకు భీమా రుసుములో 50 శాతం కానా వారు భరిస్తున్నా రన్నారు. అందరూ చైతన్యంతో ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహాయం చేసినందుకు కానా సంస్థ ని కల్లు గీత కార్మికుల సంఘం తరపున, వారి కుటుంబం తరపున అభినం దనలు తెలియజేశారు.