–ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క
–రైతులకు ఈ బడ్జెట్ ముమ్మాటికీ వెన్నుపోటే
–రుణమాఫీ, రైతు భరోసాలపై ఆం క్షలే అందుకు నిదర్శనం
–ఒక్క కొత్త పథకమైనా ఈ బడ్జెట్ లో ఉందా
— ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చీల్చి చెండాడుతాం
— అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కెసిఆర్ ఘాటు వ్యాఖ్యలు
KCR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రజల సాక్షిగా శాసన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR)అన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశా ల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతులను ఈ ప్రభుత్వం వెన్ను పోటు పొడిచిందని ఆరోపించారు. రైతు భరోసాలో ఆంక్షలు పెట్టపోతు న్నట్లు చెప్పకనే చెప్పి వారి మోసా న్ని బయటపెట్టారన్నారు. ఒక్క పథ కంపై కూడా స్పష్టత లేదని ధ్వజ మెత్తారు. యాదవుల అభివృ ద్ధి కోసం తీసుకువచ్చిన గొర్రెల పెం పకం పథకాన్ని మూసివేసినట్లుగా అవగతం అవుతోందన్నారు. దళిత బంధు పథకం ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు.
మత్స్యకా రులకు (Fisherman’s rule)కూడా భరోసాలేదని,ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా తేలేద న్నారు. మహిళలకు లక్షకోట్లు ఇస్తు న్నట్లు అబద్ధాలు చెప్పారన్నారు. రుణాలను కూడా వాళ్లు ఏదో ఇస్తున్నట్లు చెప్పారని ఆరోపించా రు.రైతులకు తాము ఇచ్చిన డబ్బు లను ఏదో ఆగం చేశామని దురదృ ష్టకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అభివర్ణించారు. రైతులను, వృత్తి కార్మికులను ప్రభుత్వం వంచించింద న్నారు.
వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు ఏంటనే అంశాలపై ప్రకటన లేదన్నారు. చిల్లర మల్లర ప్లాట్ ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్పా బడ్జెట్ (budget)ప్రసంగంలా లేదన్నా రు. ప్రభుత్వం తమ లక్ష్యం, టార్గెట్ ఏంటో చెప్పలేదన్నారు. ఇది పేదల, రైతులతో సహా ఎవరి బడ్జెట్ కాద న్నారు. భవిష్యత్ లో ఈ అంశంపై చీల్చిచెండాడుతామన్నారు.బడ్జెట్ లో రైతు భరోసా ప్రస్తావనే లేదు. రైతులను (farmers) పొగిడినట్లే పొగిడి వెన్ను పోటు పొడిచారన్నారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకు నిరాశే మిగిల్చిం దన్నారు కెసిఆర్. ఆర్థిక మంత్రి వొత్తి వొత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదన్నారు. ప్రభుత్వానికి ఆరు నెల ల సమయం ఇవ్వాలని అనుకున్నా మని, అయితే వారు మాత్రం ఆ లోపలే అన్ని అబద్దాలు చెబుతూ కాలక్షేపం చేయడంతోనే తామ నోరు విప్పాల్సి వచ్చిందన్నారు.. బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందంటూ ఇది రైతు శుత్రు ప్రభు త్వంగా మారిందన్నారు.కాగా ప్రధా న ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెం బ్లీకి కేసీఆర్ (kcr)హాజరు కావడం గమనార్హం.