Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR Vision : కేసీఆర్ ది వందేళ్ల ముందుచూపు, కాంగ్రెస్ పార్టీది మందబుద్ధి

–రెండేళ్లుగా టిమ్స్ ఆసుపత్రులను పడావుపెట్టిన సీఎం రేవంత్

–వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ను వి నియోగoలో ప్రభుత్వం విఫలం

–డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తికావడం లేదు

–బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించి న ఘనత కాంగ్రెస్ పార్టీది

–టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మా ణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ రావు

KCR Vision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరో నా తర్వాత వందేళ్ల ముందు చూ పుతో హైదరాబాద్ చుట్టూ నలువై పులా నాలుగు టిమ్స్ ఆసుపత్రు లు నిర్మించ తలపెట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉద్ఘాటించారు. టిమ్స్ లతో పాటు నిమ్స్ రెండు వేల పడకల ఆ సుపత్రి నిర్మించాలని శంకుస్థాపన చేసారని, గతంలో అనేక ప్రభుత్వా లు పని చేసినా నిజాం కాలంలో క ట్టిన గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి ఆసుపత్రులే ఉన్నాయని ఆలోచన తో కేసీఆర్ పేదల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, నాణ్యమైన సూపర్ స్పె షాలిటీ వైద్యం ప్రజలకు చేరువ చేసే లా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ పనులను ప్రా రంభించారని గుర్తు చేశారు. శనివా రం ఆయన పలువురు పార్టీ నేతల తో కలిసి హైదరాబాద్ ఎల్ బి నగర్ లోని టిమ్స్ ఆసుపత్రిని పరిశీలించి పురోగతి వివరాలు ఆరా తీశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు వ్యఖ్య లు ఆయన మాటల్లోనే…అన్ని ని ధులు కేటాయించారు, పనులు దా దాపుగా పూర్తి చేసారు. కానీ కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ముందుకు పోవడం లేదు

భూసేకరణ, టెండర్లు, డిజైన్లు పూర్తి చేసింది, నిధులు ఇచ్చింది. ఇవన్నీ పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం

సెల్లార్ తో కలుపుకొని 6 అంతస్తుల భవనం ఎల్బీ నగర్ టిమ్స్ పను లను బిఆర్ఎస్ పూర్తి చేసింది.

రెండేళ్లలో 5 అంతస్తులు మాత్రమే పూర్తి చేసారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఆసుపత్రి పనులు ప్రా రంభమై, ప్రజలకు సేవలు అందిం చేంది.కేసీఆర్ కు పేరు వస్తుందని, బిఆర్ఎస్ చేసిన మంచిని ప్రజలు గుర్తు చేసుకుంటరనే దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఆసుపత్రి నిర్మాణం ప నులు ఆలస్యం చేస్తున్నారు. ముం దు చూపు లేని మంద బుద్ధి నాయ కులు కాంగ్రెస్ నాయకులు ఎందుకు పనులు పూర్తి చేయడం లేదు,ఉన్న పనులు ఎందుకు ఆపుతున్నారు.

టిమ్స్ ఆసుపత్రుల కోసం అసెంబ్లీ లో ప్రత్యేక చట్టం తెచ్చాం, కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కు నేలా కేసీఆర్ ప్రణాళికలు రచించా రు. మొత్తంగా పది వేల సూపర్ స్పె షాలిటీ బెడ్స్ ఉండాలని చూసారు.

వందేళ్ల ముందు చూపుతో ప్రణాళిక లు వేసారు. కేసీఆర్ 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండేలా ప్లాన్ చేసారు. 2850 ఎంబీబీఎస్ సీట్లను 10వేలకు పెంచారు.మేము మహే ళ్వరం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే, జీవో జారీ చేస్తే, దాన్ని రద్దు చేసా రు.

శంకుస్థాపన చేసిన కాలేజీని రద్దు చేసి, టిమ్స్ ఎల్బీనగర్ లో విలీనం చేసారు. పేదలకు సూపర్ స్పెషాలి టీ సేవలు అందాలనే లక్ష్యాన్ని నీరు గార్చారు. మహేళ్వరంలో మెడికల్ కాలేజీ లేకుండా చేసారు.అదే విధం గా కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలే జీ శాంక్షన్ చేస్తే, దాన్ని టిమ్స్ అ ల్వాల్ లో కలిపేసారు. కేసీఆర్ అ ల్వాల్ లో మెడికల్ కాలేజీతో పా టు, 500 పడకల ఆసుపత్రి రావా లని చూసారు. కానీ మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీ, 500 పడకలు ఆసుపత్రి లేకుండా చేసారు.

కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్య ల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం, రెండే ళ్లు అయినా ఆసుపత్రుల పనులు పూర్తి చేయడం లేదు,రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వ రంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టి మ్స్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలు చేస్తే చే యండి, మా మీద కేసులు పెట్టండి.

కానీ ఆసుపత్రుల నిర్మాణాలు ఆపి తే ప్రజల తిరుగుబాటు వస్తది, రాజ కీయాల కోసం ఆసుపత్రులని ర్మా ణాలు ఆపడం దుర్మార్గం. రెండేళ్లలో 5 స్లాబులు వేస్తవా? డెడ్ లైన్లు, డే ట్లు మారుతున్నాయి తప్ప ఆసుప త్రి నిర్మాణాలు మారడం లేదు.

కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రీషన్ కిట్ బందు,తిట్ల మీద రేవంతుకు ఉన్న ప్రేమ, కిట్ల మీద లేదు, ప్రభుత్వ ఆ సుపత్రి డెలివరీలను 30 నుంచి 72 శాతానికి పెంచింది కేసీఆర్ ప్రభు త్వం, రేవంత్ రెడ్డి 55 శాతానికి త గ్గించిండు. పేదలకు వైద్యంలో తిరో గమనం,ప్రభుత్వ విద్యలో తిరో గమనం, జీఎస్టీ వృద్దిలో తిరోగమ నం, రియల్ ఎస్టేట్ లో తిరోగమనం

రేవంతు పాలనలో రాష్ట్రం వెనక్కి పోతున్నది. 47వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు.

ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీల్లో 55శాతానికి తగ్గారు.జీఎస్టీ 5శాతం మైనస్ కు పోయింది.

కేసీఆర్ హయాంలో 16శాతం పెరి గింది. కానీ రేవంత్ పాలనలో అం తా తిరోగమనం కేసీఆర్ 450 బస్తీ దవాఖానలు ప్రారంభించారు. కేం ద్రం, 15వ ఆర్థిక సంఘం తెలం గా ణను మెచ్చుకున్నది. రేవంత్ పు ణ్యమా అని బస్తీ దవాఖానలో పని చేసే డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఉద్యో గులకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు. కేసీఆర్ ప్రారంభించిన బస్తీ ద వాఖానలు మూత పడాలే అన్నదే రేవంతు లక్ష్యమా.

హైదరాబాద్ లోనే 350 బస్తీ దవా ఖానలు పెట్టిండు కేసీఆర్ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెబుతావు రే వంత్ రెడ్డి. 108 మందుల్లో సగం కూడా ఇవ్వడం లేదు. బస్తీ దవాఖా నలకు సుస్తీ పట్టించిండు రేవంత్ రె డ్డి. ఆరోగ్యశ్రీ 1400 కోట్ల బకాయి లు పడ్డయి, కేసీఆర్ ఎప్పటిక ప్పు డు నిధులు ఇచ్చిండు, 8000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు, సీఎంఆర్ఎఫ్ కిం ద 3వేల కోట్లు మొత్తంగా 11 వేల కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేసాం. కాంగ్రెస్ పాలనలో 1400 కోట్ల బకాయిలతో పేదలకు వైద్యం అందటం లేదు. ఇప్పటికి అయినా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.కంటి వెలుగు అనే అద్భుతమైన పథకాన్ని రేవం త్ బంద్ పెట్టిండు.

కేసీఆర్ వృద్దులకు గుర్తు వస్తాడనే బందు పెట్టావా, రాజకీయాలు పక్క నబెట్టి వెంటనే పథకాన్ని కొనసాగిం చు, టిమ్స్ ఆసుపత్రులను యదావి ధిగా 1000 పడకలుగా కొనసాగిం చాలి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లలో మెడికల్ కాలేజీలు కొనసాగిం చాలని డిమాండ్ చేస్తున్నాం, డాక్టర్ల ఉత్పత్తి, ధాన్యం ఉత్పత్తిలో తెలం గాణ నెంబర్ 1, కేసీఆర్ కిట్లు, న్యూ ట్రీషన్ కిట్లు, బతుకమ్మ చీరెలు ఆ పాలె, ఇదే మీ ఆలోచనా?, కేసీఆర్ ప్రారంభించిన పథకాలను ఆపడం తప్ప, మీరు చేస్తున్నదేం లేదు. ఇ ప్పటికైనా మీ మంద బుద్దిని మా ర్చుకోండి. పేదల ఆరోగ్యంతో చెలగా టం ఆపండి.

బస్తీ దవాఖానల వైద్య సిబ్బందికి వెంటనే జీతాలు ఇవ్వాలని, వరం గ ల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల ప నులు వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బిఆ ర్ ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తున్నామని చెప్పారు. ఆ యన వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కాలే రు వెంకటేష్, ఎమ్మెల్సీ యాదవ రె డ్డి, మాజీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉ న్నారు.