Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR : కేసీఆర్ కీలక సమావేశం, ఎర్రవల్లి ఫాంహౌస్ లో ముఖ్యనేతలతో భేటీ

KCR : ప్రజా దీవెన,ఎర్రవెల్లి: బీఆర్ఎస్ అ ధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీ ఆ ర్ కీలక సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.ఈ స మావేశానికి మాజీ మంత్రులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ము ఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సమీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ వ్య తిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. పా ర్టీ భవిష్యత్తు కార్యచరణపై కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశముంది.

అదే సందర్భంలో ఎమ్మెల్యే కోటా ఎ మ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని రంగంలోకి దింపాలన్న అంశంపై కూడా చర్చించనున్నారు. వచ్చే నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బ హిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ నెల 12వతేదీ నుండి ప్రారంభం కా నున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూ డా చర్చ జరిగినట్లు సమాచారం.

ఏప్రిల్ నెలలో పార్టీ రజతోత్సవాల ను ఘనంగా నిర్వహించడంలో భాగంగా జరిగిన ఈ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రా మారావు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు దీవ కొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి,మాజీ మంత్రు లు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాక రరావు,జగదీష్ రెడ్డి,సబితా ఇంద్రా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మం డలిలో పార్టీ నేత సిరికొండ మధు సూదనాచారి, మాజీ ఎంపీ బోయి నపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత,తాతా మధు, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీర య్య,రసమయి బాలకిషన్, నాయ కులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమా ర్, డాక్టర్ ఆర్.ఏస్.ప్రవీణ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.