Kiran Kumar Yadav : ప్రజాదీవెన,శాలిగౌరారం మే 13:కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నూక కిరణ్ కుమార్ యాదవ్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సీఎం కు పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలు పెంచాలని కోరారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి కిరణ్ కుమార్ యాదవ్ విన్నవించారు.సీఎం సానుకూలంగా స్పందంచినట్లు కిరణ్ కుమార్ యాదవ్ తెలిపారు.