–ప్రధానితో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తా
–వికసిత్ భారత్ లక్ష్యసాధనలో ఫార్మా పరిశ్రమదే కీలకం
–ఎగుమతుల్లో 5శాతం ఫార్మాదే –పీఎం గతి శక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన
–ఫార్మా సూటికల్ కాంగ్రెస్ సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) లక్ష్యంగా పెట్టుకున్న వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్ద తు చాలా అవసరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్ ఫార్మ సీ హబ్ గా నిలవడం వెనక ఫార్మా ఇండస్ట్రీ కృషి ఎంతో ఉందన్నారు. హైదరాబాద్లో ఫార్మా యూనివర్సిటీ (Pharma University) ఏర్పాటు విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. హైటెక్స్ లో ఆదివారం నిర్వ హించిన ఇండియన్ ఫార్మా సూటి కల్ (Indian Pharma Pharmaceuticals) కాంగ్రెస్ 73వ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారత ఫార్మా పరిశ్రమ శక్తిని గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం, దానికి అవస రమైన సహకారాన్ని అందిస్తోం దన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యలతో దేశంలో మెడికల్ కాలేజీలు 201 4లో 388 ఉంటే ఇప్పుడు 706కు పెరిగాయన్నారు.
ఆయుష్మాన్ భార త్ పథకం (Ayushman Bharat Scheme) ద్వారా 12 కోట్ల కుటుం బాలకు రూ.5 లక్షల వరకు వైద్య బీమా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల (Pradhan Mantri Jan Aushadhi Kendra) వల్ల ప్రజలకు 50 నుంచి 90శాతం తక్కువ ధరకు మందులు అంది స్తున్నామని వివరించారు. దేశంలో,హైదరాబాద్ లో ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగా లకు ప్రాతింధ్యం వహించే 50వేల మంది ఫార్మసీ ప్రొఫెషనల్ పాల్గొన్న సమావేశంలో ప్రసంగించడం సం తోషంగా ఉందన్నారు. దేశ ఎగు మతుల్లో ఫార్మా ఉత్పత్తులు (Pharma products) అయి దో స్థానంలో ఉన్నాయన్నారు.
ఎగుమతుల్లో 5శాతం కన్న ఎక్కువ వాటా ఈ ఫార్మా రంగానిదేనన్నారు. గతేడాది రూ.1.83 కోట్ల విలువైన ఫార్మాషూటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్నారు. ఇందులో 35 శాతం, అంటే 67 వేల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఒక్క అమెరికాకే ఎగుమతి చేశా మన్నారు. భారతీయ ఫార్మాసూటికల్ (Indian Pharmaceutical) ఉత్పత్తులు నాణ్యతలో, ఇతర అన్ని విధాలుగా బెస్ట్ అని చెప్పారు. కరోనా కష్టకాలంలో భారతదేశం యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసి యావత్ ప్రపంచానికి అందజేసి ప్రపంచానికి అందజేసిందన్నారు. త్వరలోనే దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగనుందని చెప్పా రు. 2027 నాటికి భారతను ప్రపం చంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవ స్థగా నిలపాలన్నది ప్రధాని మోడీ (modi) సంకల్పమన్నారు.
పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం “పీఎంగతి శక్తి” ద్వారా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విమానాశ్రయాలు, రైల్వే నెట్వర్క్ అభివృద్ధి, జాతీయ రహదారుల నిర్మాణం తదితర పలు కీలకమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం (Central Govt) కల్పిస్తోందని దీంతో ఫార్మ వంటి రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందన్నారు. రాబోయే బల్క్ డ్రగ్ పార్కులో (Bulk Drug Park)కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను పెంచేందుకు మోడీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. భారతీయ ఫార్మ రంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు కేంద్రం అమలు చేస్తున్న ఫార్మాసూటికల్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీం దోహదపడుతుందన్నారు.