Kodada MLA Padmavati Reddy: ప్రజా దీవేన, కోదాడ: నిరుపేదలకు పేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం తక్కువ ఫీజుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్ రోడ్డులో వెంకటేశ్వర థియేటర్ వెనకాల నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అమె ప్రారంభించి మాట్లాడారు. కోదాడ ప్రాంత ప్రజలు సుదూర నగరాలకు వెళ్లకుండా కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తేస్తున్న కోదాడ ప్రాంత వైద్యులను అభినందించారు. ఆపద సమయంలో వ్యాపార దృక్పథంతో కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వైద్యులను సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని కొనియాడారు.
ఈ సందర్భంగా వైద్యశాల యాజమాన్యం డాక్టర్ రాజేందర్, భవాని దంపతులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ,డాక్టర్ సుబ్బారావు,రామారావు, అశోక్, ప్రసాద్, రంజిత్, జనార్దన్, బత్తినేని హనుమంతరావు, మామిడి రామారావు, మల్లీశ్వరి, డాక్టర్ జగన్నాథ చార్యులు, చింతాబాబు, తిప్పిరిశెట్టి సుశీల రాజు, నెమ్మది ప్రకాష్ బాబు, దేవమణి, మేనేజ్మెంట్ బొబ్బిలి లచ్చిరెడ్డి, మాజీ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.