కోల్‌కతా హత్యాచార ఘటనపై వైద్యురాలి తల్లిదండ్రుల ఆరోపణ
Kolkata murder incident: ప్రజా దీవెన, కోల్‌కతా: కోల్‌కతా హత్యాచార ఘటనలో (Kolkata murder incident) వైద్యురాలి తల్లిదండ్రులు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని(Doctor’s murder ritual) నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్‌కతా ఆర్‌జీ కర్ దవాఖాన (RG Kar Hospital) వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం క్యాండిల్స్‌తో వైద్యురాలి మృతికి నివాళి అర్పించారు. మరోవైపు, ట్రైనీ డాక్టర్ (Trainee Doctor)హత్యాచారం జరిగిన మర్నాడే అప్పటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు బయటపడింది. ఆగస్టు 9న డాక్టర్‌పై దారుణం జరగగా, ఆగస్టు 10న ఘోష్ పీడబ్ల్యూడీకి ఓ లేఖ రాశారు. అన్ని డిపార్ట్‌మెంట్లలోని ఆన్ డ్యూటీ డాక్టర్ల గదుల్లో మరమ్మతులు, ఆధునికీకరణ, పునర్నిర్మాణ పనులను చేయాలని కోరారు.