–సామూహిక అత్యాచారం జరిగిం దని నిర్ధారణ
Kolkata RG Kar Hospital:ప్రజా దీవెన, కోల్‌కతా: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College)ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి పై హత్యాచార ఘటన దేశవ్యాప్తం గా కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనపై డాక్టర్ సుభర్ణ గోస్వా మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ట్రైయినీ వైద్యు రాలిపై సామూహిక అత్యాచారం (Gang rape) జరిగిందని వెల్లడించారు. బుధవా రం మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి (Subharna Goswami) మాట్లాడుతూ ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవ పదార్థం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలి పారు. ఈ నేపథ్యం లో ఆమెపై సామూహిక అత్యాచా రం జరిగిందని స్పష్టమవుతుందని తెలిపారు. ఈ హత్యాచార ఘటన లో పలువు రు ప్రమేయం ఉందని ఈ సంద ర్భంగా అభిప్రాయపడ్డా రు.ఇదే విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు సైతం స్పష్టం చేశారని డాక్టర్ గోస్వామి గుర్తు చేశారు. అలాగే ఆమె శరీరంపై గాయాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క వ్యక్తి మాత్రమే అయితే.. ఆమెను అంతలా గాయం చేసే అవకాశాలు అయితే లేవని స్పష్టం చేశారు. శుక్రవారం తెల్లవారుజా మున అంటే ఆగస్ట్ 9 తేదీన సెమి నార్ హాల్‌లో నగ్నంగా పడి ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ట్రైయినీ విద్యా ర్థిని మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బం ది గుర్తించారు. ఈ ఘటనకు సంబం ధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా చేరుకున్న సీబీఐ అధికారులు (CBI officers).. మరోవైపు ఈ హ త్య ఘటనపై దేశవ్యాప్తంగా నిర సనలు అయితే వెల్లువెత్తు తున్నా యి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు, నిరసనలు (Agitations and protests) చేపట్టారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించిం ది. దాంతో సీబీఐ అధికారులు బుధవారం కోల్‌కత్తాలోని ఆర్ జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆసుపత్రి ఉన్నతాధికారులతో సీబీఐ అధి కారులు సమావేశమయ్యారు. అదీకాక ఈ హత్యాచారం కేసులో పోస్ట్‌మార్టం నివేదికతోపాటు ఈ ఘటన చోటు చేసుకున్న సమ యంలో ఆ యా ప్రాంతంలోని సీసీ ఫుటేజ్‌లను బహిర్గతం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్న విష యం విధితమే.
పోస్టమార్టం నివేదికలో ఏముందంటే.. ట్రైయినీ వైద్యురాలి గొంతు కోసి హత్య చేశారు. దాంతో ఆమె థైరాయిడ్( Thyroid)భాగంలోని మృదులాస్థితి విరిగిపోయింది. అలాగే ఆమె మృతదేహంలోని ప్రైవేట్ భాగాల్లో సైతం గాయాలు స్పష్టంగా కనిపించాయి. అదే విధంగా పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై భాగంలో సైతం గాయాలను గుర్తించారు. ఆమె కళ్లతోపాటు నోటి నుంచి సైతం రక్తం కారిన విషయా న్ని ఈ నివేదికలో స్పష్టం చేశారు. లైంగిక దాడి జరిగినప్పుడు బిగ్గరగా అరవకుండా.. ఆమె నోటిని గట్టిగా బిగించారు. దీంతో ఆమె ఊపిరా డని పరిస్థితిలోకి వెళ్లారు. అలాగే ఆమె తల భాగాన్ని గోడకు కొట్టి నట్లుగా ఈ నివేదికలో స్పష్టమైంది. ముఖంపై గీతలు సైతం కనిపిం చాయి. లైంగిక దాడి చేసే క్రమంలో ఆమెను తీవ్రంగా హింసించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక సైతం స్పష్టం చేసింది.