Komati Reddy Raj Gopal Reddy: ఎగ్జిబిషన్ ని సందర్శించిన మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy:ప్రజా దీవెన, చౌటుప్పల్: చౌటుప్పల్ లోని బాలికల గురుకుల పాఠశాల కళాశాల (Girls’ Gurukul School College) వద్ద అంతరిక్షం పై , అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష వాహక నౌకలపై అవగాహన కల్పించే విధంగా బస్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Raj Gopal Reddy)సందర్శించారు. ప్రభుత్వ పాఠశా లలో చదివే విద్యార్థిని విద్యార్థులకు అంతరిక్షం, అంతరిక్ష ప్రయో గాలపై (Space, space probe)అవగాహన కల్పించడానికి, అంతరిక్ష రంగంలో ఉద్యోగ అవకా శాలను అందిపుచ్చుకునే విధంగా స్పేస్ ఆన్ వీల్స్ ఎగ్జిబిషన్ బస్సు లను భారతదేశ వ్యాప్తంగా తిప్పు తున్నామని నిర్వాహకులు ఎమ్మె ల్యేకు వివరించారు.ఈ బస్సులో అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు, అంతరిక్షంలోకి పంపించే రాకెట్లు, అవి మోసుకెళ్లే శాటిలైట్లు, ఏ విధంగా అంతరిక్షంలోకి ప్రవేశ పెడతారనే విషయాలకు సంబం ధించి అర్థమయ్యే విధంగా ఎగ్జిబి షన్ను ఏర్పాటు చేశారు.ఈ ఎగ్జి బిషన్లో చంద్రయాన్, ఆదిత్య యల్ వన్ ల ప్రయోగాలు, పిఎస్ఎల్వి వాహక నౌకలు, జి ఎస్ ఎల్ వి వాహక నౌకల ద్వారా వివిధ శాటిలైట్ లను వాటికక్షలో ఎలా కూర్చోబెడతారు అనే విషయాలు విద్యార్థులకు సులభంగా అర్థ మయ్యే రీతిలో ప్రదర్శిస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేసిన అధికారిని, సైంటిస్ట్ ని ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Raj Gopal Reddy) అభినందించారు.