Komati Reddy Raja Gopal Reddy: ప్రజా దీవెన, నాంపల్లి: క్షేత్రస్థా యి లో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను స్వయంగా తెలుసుకోవ డానికి రోజుకో గ్రామం చొప్పున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటిస్తున్నారు. నాంపల్లి మండలం దామెర గ్రామా నికి ఉదయమే చేరుకుని పలు వీ ధుల్లో కలియతిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వ యంగా తెలుసుకుంటూ వెంటనే అధికారులను పిలిచి పరిష్కరించా లని ఆదేశించారు.
ముఖ్యంగా డ్రైనేజీలు రోడ్లు పరిశీ లించారు వెంటనే ఎంపీడీవో గ్రామ కార్యదర్శి పిలిపించి వారం రోజులు డ్రైనేజీ క్లియర్ చేయాలన్నారు. గృ హాల మీద నుండి కరెంటు లూస్ లై న్స్ ఎక్కువగా ఉండడంతో కరెంటు ఏఈ ని వెంటనే పిలిపించి సమస్య ను పరిష్కరించాలన్నారు.కరెంటు విషయంలో నాంపల్లి మండలంలో నే దామెర గ్రామాన్ని రోల్ మోడల్ గా చేయాలని విద్యుత్ అధికారుల ను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధి దారుల వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మరి కొంత మందికి ఇల్లులు రాలేదని గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురా నిజ మైన లబ్ధిదారులు ఎంతమంది ఉ న్నారనే జాబితాను సిద్ధం చేయాల ని స్థానిక నాయకులకు చెప్పారు. ఎంతమంది నిజమైన లబ్ధిదారులు ఉంటే అంతమందికి రెండవ విడత లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చే యించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అనారోగ్యం పాలైన ప్రజ లను ఆత్మీయంగా పలకరిస్తూ వారి చికిత్సకు సహాయం చేస్తానని హా మీ ఇచ్చారు. మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులతో మాట్లా డి దామెర గ్రామంలో ఎటువంటి స మస్య లేకుండా చూడాలని సూవి చించారు.
దామర గ్రామ పర్యటనలో గౌరవ శాసనసభ్యులతో పాటు అన్ని శా ఖల మండలాధికారులు, అన్ని శాఖల గ్రామీణ అధికారులు, నాం పల్లి మండల ముఖ్య నాయకులు, దామెర గ్రామ ముఖ్య నాయకులు ప్రజలు పాల్గొన్నారు.