Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: దసరాకు చౌరస్తా అభివృద్ధి పనులు

–తిప్పర్తి చౌరస్తా అభివృద్ధితో అం దంగా తీర్చిదిద్దుతాo
–చిరు వ్యాపారాలకు శిల్పకళా వేది కలో మాదిరిగా షాపులు నిర్మించి ఇస్తాం
–డిస్ట్రిబ్యూటరీల తో అన్ని చెరు వుల నింపుతాం
–తిప్పర్తి చౌరస్తా అభివృద్ది పనుల శంఖుస్థాపనలో మంత్రి కోమటిరెడ్డివెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన తిప్పర్తి: నల్గొండ జిల్లా తిప్పర్తి మండల చౌరస్తాను ఆర్ అండ్ బి నిధుల ద్వారా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)తెలిపారు. శనివారం ఆయన తిప్ప ర్తి మండల కేంద్రంలోని చౌరస్తాను 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిప్ప ర్తి మండల కేంద్రంలోని చౌరస్తా అభి వృద్ధిలో భాగంగా మంచి వాతావ రణం కల్పించడంతో పాటు, అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని (Ambedkar bronze statue) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాక ఫౌంటెన్ తో పాటు, చౌరస్తా చుట్టు ఇప్పటివరకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారికి శిల్పకళా వేదికలో మాదిరిగా షాపులు నిర్మిం చి ఇస్తామని తెలిపారు . అంబేద్కర్ ఇందుకుగాను చౌరస్తా అభివృద్ధి పనులకు ఇదివరకే టెండర్లను పిలవడం జరిగిందని, ఆదివారం నుండి పనులు ప్రారంభం చేయా లని ఆయన అధికారులను ఆదే శించారు.

చౌరస్తా అభివృద్ధి వల్ల తిప్పర్తి చౌరస్తాకు (Tipparti Square) మంచి అందం వస్తుందని,తిప్పర్తి కి బైపాస్ ఉన్నం దున ట్రాఫిక్ కు ఎలాంటి అంతరా యం కలగదని ,చౌరస్తా మీదుగా వెళ్లే వారికి అదేవిధంగా చౌరస్తా చుట్టూ షాపులు, ఇతర వ్యాపా రాలు నిర్వహించుకునే వారికి ఆహ్లా దాన్ని కలిగించే విధంగా పార్కును, ఫౌంటెన్ ను, చెట్లను, పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేసి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పెడతామని తెలిపారు. తెలంగాణ రావడానికి డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ రాసిన రాజ్యాంగమే ముఖ్య మని, అలాంటి మహనీయుని విగ్రహాన్ని తిప్పర్తి చౌరస్తాలో ఏర్పా టు చేసుకోవడం అదృష్టంగా భావి స్తున్నట్లు తెలిపారు. దసరా లోపు చౌరస్తా అభివృద్ధి పనులను పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకునే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడిం చారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjunasagar project) డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీటి విడుదల పై మంత్రి మాట్లాడు తూ,డి- 37 తో పాటు, 39, 40,41 డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆదివారం నుండి అన్ని చెరువుల నింపే కార్యక్రమాన్ని చేపెట్టనున్నట్లు తెలిపారు. అందువల్ల రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ సంవత్సరం సరైన వర్షాలు లేకున్నప్పటికీ పైనుండి కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్ డ్యామ్ (Nagarjunasagar project) నిండి ఆ నీటిని కాలువలకు వదిలి రైతులు వ్యవసాయం చేసుకునే అవకాశం కలగడం అదృష్టమని అన్నారు. వచ్చిన నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో భాగంగా ముందుగా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టామని, పోలీసు, ఇరిగేషన్, రెవెన్యూ (Police, Irrigation, Revenue)తదితర శాఖల అధికారులను ఏర్పాటుచేసి డిస్ట్రిబ్యూటరీల ద్వారా జాగ్రత్తగా నీటిని కిందికి వదలడం, చెరువులను నింపడం చేస్తున్నామని తెలిపారు. కాలు వలలో పేరుకుపోయిన పూడికను, అదేవిధంగా చెత్తను తొలగించేందు కు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 15 రోజులుగా 13 మిష న్లను ఏర్పాటు చేసి వాటిని తొలగి స్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని చెరువులన్నింటి నింపేలా చూ డాలని ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కోరారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రఘువీర్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్, నల్గొండ ఆర్డీవో రవి,ఆర్ అండ్ బి ఎస్ ఈ నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రామి రెడ్డి ,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.