— రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, కనగల్: నల్గొండ జిల్లాలో ఆర్ అండ్ బి రహదారుల ఏర్పాటు ,పటిష్టతకు ఆర్ అండ్ బి శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి తెలిపారు.సోమవారం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, తిమ్మన్నగూడెం వద్ద ఆర్ అండ్ బి సాగర్ రోడ్డు నుండి కనగల్ వయా తిమ్మన్నగూడెం వరకు 14 కోట్ల రూపాయల వ్య యంతో నిర్మించి పటిష్టపర చనున్న ఆర్ అండ్ బి రోడ్డు పనులకు శంకు స్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు ఆర్ అండ్ బి ద్వారా ప్రత్యేక నిధులను తీసుకువచ్చి రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమంలో భాగంగా ఈనెల 26 నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలని అమలు చేయబోతున్నదని తెలిపారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా త్వరలోనే లబ్ధిదారులకు ఖాతాలలో 6000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పాత రేషన్ కార్డులను కొనసాగించడంతోపాటు, నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వనున్నామని, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని అర్హుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,త్వరలో నిర్వహించనున్న గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కింద రుణమాఫీ పొందని రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఆర్డిఓ అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ గణేష్, కనగల్ తహసిల్దార్ పద్మ ,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు .
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*