–నల్లగొండ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొ న్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
–ముస్లిం సోదరులకు శుభాకాంక్ష లు తెలిపిన మంత్రి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డు లో గల ఈద్గా లో బక్రీద్ (BAKRID)పర్వదినా న్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మా త్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) ప్ర త్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థ నల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ముస్లిం సోదరులకు, అదే విధంగా రాష్ట్ర ముస్లిం సోదర, సోదరీమణు లకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు (Happy Bakrid festival) తెలియజేశారు.
బక్రీద్ పండుగ (Bakrid festival) అంటేనే త్యాగాలకు ప్రతీక అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో గత 30 సంవ త్సరాలుగా హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారని గుర్తు చేశారు. పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తామ ని, రోజు రోజుకు జనాభా పెరుగు తున్న తదననుగుణంగా ఈద్గాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు.ముస్లింలకు విద్యారంగంలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తా మని, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పి స్తామని చెప్పారు. అందరూ బాగుం డాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తుతో శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చేసిన పోలీస్ శాఖను, ఎస్పీ చంద నా దీప్తికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా ఎస్పీ చందనా దీప్తి, రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పి రాములు నా యక్, నల్గొండ ఆర్డీవో రవి, నల్గొండ ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ లు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Prev Post
Next Post