–రహదారుల అభివృద్ధికి పెద్దపీట –పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ
–రోడ్లు భవనాల శాఖామంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, యాదాద్రి: హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేందుకు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)హామీ ఇచ్చారు. ఈ హైవే నిర్మిస్తే (highway is built)కేవలం 30నిమి షాల్లో ఉప్పల్ నుంచి యాదాద్రి వెళ్లొచ్చని తెలిపారు. యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీపీ, ఎంపీటీసీల ఆత్మీ య వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎం పీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Minister Komati Reddy Venkata Reddy, MP Chamala Kiran Kumar Reddy, MLA Birla Ailaiah)హాజర య్యారు. ఈ సందర్భంగా మాట్లా డిన ఆయన తాను ఎంపీగా ఉన్న ప్పుడు 100శాతం జాతీయ రహ దారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లాలో రూ.100 కోట్ల తో అభి వృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఎంపీగా గెలి పించి నప్పుడే చాలా పనులు చేసిన తా ను ఇప్పుడు మంత్రి అయ్యాడని రెట్టింపు పనులు చేస్తానని హామీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో (BRS Govt) కూడా తనను ఎంపీగా గెలి పించినందుకు కార్యకర్తలకు రుణ పడి ఉంటానన్నారు. యాదాద్రి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్పెస్ హైవే రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాలయాన్ని అభివృద్ధి చేసింది కానీ రహదారు లు, మున్సిపల్ పరిధిలో ఉన్న జనాల బాగోగులు మరచిపోయా రని విమర్శించారు. గతంలో ప్రభు త్వానికి రహదారులు అభివృద్ధిపై ఎన్నోసార్లు వినతిపత్రాలు అంద జేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. అందుకే ఇప్పుడు రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ట్లు వివరించారు. యాదా ద్రిని యాదగిరిగుట్టగా పేరు మా ర్చాలని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) తెలి పినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో అన్నిరకాల ఉపాధి అవకా శాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నట్లు పేర్కొన్నారు. భువన గిరి ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే దానికోసం రూ.210కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాల్లో బస్వాపూర్ పూర్తి చే స్తామని, ఇందుకోసం టెండర్లను పిలవబోతున్నట్లు వెల్లడించారు. రైతాంగానికి మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, . రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో (cabinet meeting)చెప్పిన విధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగష్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. త్రాగు నీటి, మురికి కాలువలు సంబంధించి ఏ సమస్య వచ్చినా తనకు కానీ, ప్రజాప్రతినిధులకు తెలియ జేస్తే సంబంధిత అధికారులతో పరిష్కరిస్తామని చెప్పారు.