Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: పదేళ్లు యువరాజు ప్రభుత్వమే నడిచింది

–ఇప్పుడు అలా కాదు, ఎవరైనా ఎప్పుడైనా మీ సమస్యలు మా దృష్టికి తేవచ్చు
–క్రెడాయ్ స్టేట్ కాన్ 2024 ప్రారంభో త్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: క్రెడాయ్ స్టేట్ కాన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ (Confederation of Real Estate Developers Associations)జ్ అన్ఆఫ్ ఇండి యా (క్రెడాయ్) తెలంగాణ స్టేట్‌కా న్- 2024 ప్రారంభోత్సవ కార్య క్రమం జరిగింది. ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్త మ్ కుమార్ రెడ్డి, కోమటి వెంకట్ రెడ్డి లు, ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లా డుతూ గతంలో యువరాజు ప్రభు త్వం మాత్రమే ఉండేదన్నారు. మీకు పనులు కావాలంటే ఆ ప్రభుత్వంలో కేవలం ఇద్దరిని మాత్రమే కలిస్తే సరిపో యేదన్నారు. అందులో ఒకరు ఫామ్ హౌస్ లో ఉంటే.. ఇంకొకరు విదేశాల్లో సెల్ఫీలు దిగడం, ఫొటోల కు పోజులు ఇవ్వడం సరిపోయేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.ఇ ప్పుడు అలా కాదని ఎవరైనా ఎప్పుడైనా మీ సమస్యలు తమ దృష్టి కి తీసుకురావొచ్చని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. క్రెడాయ్ సమస్యలు నేరుగా మాకు చెప్పొచ్చన్నారు.

గత సర్కారు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిందని.. వేల కోట్ల కాళేశ్వరం కూలి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) చెక్కు చెదరలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన చరిత్ర మాదని కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణలో నిర్మాణ రంగం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఒక్క హైదరాబాద్‌కే కాదు ఇది జిల్లాలకు వ్యాప్తి చెందిందన్నారు. ఇవాళ ఓఆర్ఆర్‌కు ఇంత పేరు వచ్చిందంటే దివంగత నేత రాజ శేఖర్ రెడ్డి ముందు చూపే కారణమన్నారు. గతంలో చంద్రబాబు డెవలప్మెంట్ ను హై టెక్ సిటీకే పరిమితం చేశారని.. దీన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజ శేఖర్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారన్నారు. ఓఆర్ఆర్ కంటే అద్భుతంగా ట్రిపుల్ ఆర్ (RRR)టెండర్లు పిలవబోతున్నామని కోమటిరెడ్డి అన్నారు. సిటీ ఒకే వైపు కాకుండా సౌత్ సైడ్ కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి (Bhuvanagiri MLA Anil Reddy ma) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గలేదన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. అత్యధికంగా బిల్డర్స్ , కార్మికులు, ఉన్న అసోసియేషన్ క్రెడాయ్ అని అనిల్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తలమానికంగా ఓఆర్ఆర్ ఉందన్నారు. త్వరలో మూసి ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరగనుందన్నారు. మూసి అండ్ ఈసా మీద బఫర్ సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు.