— వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోమ్ము లక్ష్మయ్య*
Kommu Lakshmaiah: ప్రజా దీవెన నాంపల్లి మే 25 : కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వము అధికారం చేపట్టిన నాటి నుండి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు రాయితీలు కలిపిస్తూ పేదలకు మాత్రం బారాలు మోపుతున్నారని గ్రామీణ పేదలకు బువ్వ పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోమ్ము లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మేళ్ళవాయి గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కార్మిక సమస్యలను తెలుసుకొని అనంతరం వారి ఉద్దేశించి నర్సింహ మాట్లాడుతూ మోడీ 11 సంవత్సరాల పాలనలో ప్రజలపైన భారాలు మోపడం తప్ప వారికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్త పోరాట ఫలితం 2005లో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి అనేక రకాలైన కొర్రీలు పెడుతూ కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కూలీలకు రోజు కూలీ 600 ఇవ్వమంటే 307 రూపాయలు నిర్ణయించ 150 వందల నుంచి 200 రూపాయలు ఇవ్వడం ఏమిటి అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి 6 కోట్ల పని దినాలు అవసరం ఉంటే చట్టంలో కార్మికులు తాగడానికి నీళ్లు, నీడ కోసం టెంటు, మెడికల్ కిట్టు లాంటి మౌలిక సౌకర్యాలు ఉంటే వాటిని అమలు చేయడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేసి కొత్త జాబ్ కార్డులు ఇచ్చి నూతన పనిముట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు ఇచ్చి పర్మినెంట్ చేసి జీతాలు పెంచాలని, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ఉచిత వైద్యం అందించాలని, చనిపోతే 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, సంవత్సరానికి 200 వందల రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ 600 ఇవ్వాలని కోరారు. వీటి సాధన కోసం 30వ తేదీన నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కసిపాక నరసింహ, భూతం నరసింహ, శివ, గీత, సైదమ్మ, రమాదేవి, మల్లమ్మ, యాదమ్మ, రేణుక, రాములు,పాల్గొన్నారు