రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ
ప్రజా దీవెన , ఆంధ్రప్రదేశ్:త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖ శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్, పేర్లను బిజెపి జాతీయ పార్టీ ప్రకటించింది.
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్యకు తిరిగి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది..