— రేవంత్ తీరుపై మండిపడ్డ కెటిఆర్
–పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలి స్పీకర్ ను సమయం కోరా మని జగదీశ్ రెడ్డి వెల్లడి
ప్రజా దీవెన, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (REVANTH REDDY) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను (BRS MLAs) కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న రేవంత్ తీరును ఎక్స్ వేదికగా కేటీఆర్ (KTR) ఎండగట్టారు. ప్రచారంలో నీతులు మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాన నీతిమాలిన పనులు చేస్తున్నారని విమర్శిం చారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని, ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారు. రాజీనామా (resignation)చేయకుండా ఇతర పార్టీల్లో చేరితే ఊళ్లనుంచే తరిమికొట్టమన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డినే బీఆ ర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరా యిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే. అందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరే అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు.
ఇదిలావుంటే బీఆర్ఎస్ ను (BRS) వీడి కాంగ్రెస్ పార్టీలో కి వెళ్లిన ఎమ్మెల్యేలపై సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagdish Reddy) మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావాల్సి ఉందన్నారు. హైదరాబాద్ లో (HYDERABAD) ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టం ప్రకారం డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ్యత్వాలు రద్దు కావాలి. ఆ ఇద్దరు ఎమ్మెల్యే లపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్న సమయం కోరాం. వెసులు బాటు చూసుకొని సమయం ఇస్తాన ని స్పీకర్ చెప్పారు. స్పీకర్ న్యాయం గా సమయం ఇస్తారని ఆశిస్తున్నాం. అనర్హత పిటిషన్లపై ఈ నెల 27న హైకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను వంచిస్తోంది. రాహుల్ కాంగ్రెస్ ఒక విధానం.. రేవంత్ కాంగ్రెస్ మరో విధానం. గత పదేండ్లలో ఫిరాయింపులను ప్రోత్సహించింది బీజేపీ. బీజేపీకి తోకగా తెలంగాణ పీసీసీ వ్యవహ రిస్తోంది అని జగదీశ్ రెడ్డి (MLA Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ, జగిత్యాల ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలుపొందారు. వీరిద్దరిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ (DEMAND) చేస్తున్నారు.