KTR Protests for Farmers September14 : బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రక టన, రైతుల కోసం కేటీఆర్ మరో పోరుబాట, సెప్టెంబర్14 డెడ్‌లైన్

KTR Protests for Farmers September14 : ప్రజా దీ వెన,మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆ యకట్టు రైతుల సమస్యపై బీఆ ర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పోరుబాట ప్రకటించా రు. రైతుల పంట లు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిం చిన ఆయన సెప్టెంబర్ 14లోపు సాగర్ ఎడమ కాలువకు నీ టి విడుదలపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. గడువులోగా ప్రభుత్వం స్పందించక పోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలి యా వరకు స్వయంగా పాదయాత్ర చేపడతానని కేటీఆర్ సంచలన ప్రకటన చే శారు. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నీళ్లు లేక కాదు ప్రభుత్వ చిత్తశుద్ధి లేక
సాగర్‌లో ప్రస్తుతం సుమారు 18 0 టీఎంసీల నీరు ఉన్నప్ప టికీ ఎ డమ కాలువ కింద రైతులకునీరు అందడం లేదని కే టీఆర్ విమర్శించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ రైతుల పం టలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేద ని ఆరోపించారు.ఈ సీజన్ లో సాగర్ ఎడమ కాలువకు నీటి ని విడుదల చేసే అవకాశం ఉన్న ప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ నా యకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే ఆద ర్శంగా నిలిచిందని కే టీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అన్న పూర్ణగా, ధాన్య భాండాగా రంగా మారిందని అన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ఉత్ప త్తిలో కీలకంగా నిలిచింద ని, తెలంగాణ రైస్‌బౌల్‌గా పేరున్న మిర్యాలగూడ ప్రాంతం ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడేదని గుర్తుచేశారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు పంటలకు నీళ్లు కావాలంటూ రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం ప్ర భుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.మిర్యాలగూడతో పాటు హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపే ట, నల్లగొండ, నకిరేకల్ తదితర ప్రాం తాల్లో సాగర్ ఎడమ కాలువ కిం ద ఉన్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కేటీఆర్ తెలిపా రు. కేసీఆర్ హయాంలో ధీమాగా వ్యవసా యం చేసిన రైతులు ఇప్పుడు పంటలకు నీరు వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో అనేక హామీలు ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. రెండు లక్షల రుణమా ఫీ, రైతులకు ఆర్థిక సాయం, కౌ లు రైతులకు మద్దతు, పంటలకు బోనస్ వంటి హామీలను ప్రభుత్వం పూ ర్తిగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
రైతులు కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేసి ఇప్పుడు మోసపోయా మని భావించే పరిస్థితి వచ్చిందని వ్యా ఖ్యానించారు. రైతు లకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వా లని డిమాండ్ చేశారు.
2003 నాటి పోరాట బాటలో
సాగర్ ఎడమ కాలువ రైతుల స మస్యపై 2003లో కేసీఆర్ చేపట్టి న కోదాడ-హాలియా పాదయా త్రను కేటీఆర్ గుర్తుచే శారు. అప్ప టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు నీ రు విడుదల చేయిం చడంలో కేసీఆర్ విజయం సాధిం చార ని తెలిపారు.అదే పోరాట స్ఫూర్తితో ఇప్పుడు రైతుల కోసం మరోసారి పాదయాత్రకు సిద్ధమ వుతున్నట్లు ప్రకటించారు.
కేటీఆర్ డెడ్‌లైన్ ఇదే..
సెప్టెంబర్ 14లోపు ఎడమ కాలు వకు నీటిని ఎప్పుడు విడు దల చేస్తారు? ఎన్ని తడులకు నీరు ఇ స్తారు? ఎంత మేరకు నీరు అంది స్తారు? అనే విషయాలపై స్పష్ట మైన షెడ్యూల్ ప్రకటించాలి. లేకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదా డ నుంచి హాలియా వరకు నేనే స్వయంగా పాదయాత్ర చే స్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.నల్గొండ, సూర్యాపేట, ఖ మ్మం జిల్లాల్లో సాగర్ ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, నీటి పారుదల శాఖ రైతుల ఆవేదన ను అర్థం చేసుకుని తక్షణమే స్పందించాల ని కోరారు.
రైతులకు అండగా కేసీఆర్ ఉన్నా రని, బీఆర్‌ఎస్ పార్టీ మొ త్తం రైతాంగం పక్షాన నిలుస్తుందని కేటీ ఆర్ భరోసా ఇచ్చా రు. అసెంబ్లీ లో రైతుల సమస్యలపై ప్రభు త్వాన్ని నిలదీస్తా మని, అక్కడ స రైన స్పందన రాకపోతే ప్రజాక్షేత్రం లో ఉద్య మాన్ని మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. రైతు ల కళ్ల ముందే పంటలు ఎం డిపోతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వం స్పందిం చకపోతే కేసీఆర్ స్ఫూర్తితో రైత న్నలతో కలిసి పాదయాత్ర చేసి వారి హక్కుల కోసం పోరాడతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.







