Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: గల్ఫ్ కార్మికుల కష్టాలు వింటే గుండె తరుక్కుపోతుంది

–గతంలో గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ తేవాలని ప్రయత్నం చేశాం
–మేక బతుకు పుస్తకావిష్కరణ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR:ప్రజా దీవెన, హైదరాబాద్: గల్ఫ్ కార్మికుల కష్టాలు విన్నా, చూసినా గుండె తరుక్కుపోతుందని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పేర్కొన్నారు. అక్కడ వారు నివసి స్తున్న పరిస్థితులను చూస్తే బాధ కలుగుతుందని అన్నారు.గతంలో గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ తేవా లని ప్రయత్నం చేశామని, టామ్ కామ్ సంస్థ (Tom Com company) ద్వారా కొంత ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. స్వర్ణ కిలా రి రాసిన మేక బతుకు పుస్తకాన్ని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్ర మంలో కేటీఆర్ ఆవిష్కరించారు.

నేను స్వయంగా దుబాయ్ (Dubai)వెళ్ళాన ప్పుడు అక్కడ ఉన్న లేబర్ క్యాంపు లో (Labor camp) కార్మికుల కష్టాలను చూసానని చెప్పారు. కానీ మరింత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని, వలస ఎంత వాస్తవమో,వలస లోన దోపిడీ కూడా అంతే వాస్తవం, అది దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా ఇంకెక్కడైనా యధావిధిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.పెద్దూరు వలస కార్మికుల కోసం దుబాయ్ లోని జైలుకు (jail) వెళ్లి కలిసి వచ్చానని తెలిపారు.వారిని విడిపించేందుకు అనేక ప్రయత్నా లు చేసి సంవత్సరాల తర్వాత చివరికి ఇండియాకి తీసుకు రాగలిగామని పేర్కొన్నారు. గతంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మం త్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ కి జరుగుతున్న ఆడవా ళ్ళ ఆక్రమణపైన చర్చించామని, ఆ దిశగా దాని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవా లని కోరారు. ఒకనాడు దేశంలో ఎక్కడ నిర్మాణం జరిగిన పాల మూరు జిల్లా నుంచి వలసలు ఉండేవన్న నానుడి ఉండేదని, ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ దాకా అనేక రంగాల్లో రాష్ట్రాలు నుంచి తెలంగాణకు వలస వస్తున్నారని అన్నారు.

ప్రస్తుతం సమాజంలో చదివే అల వాటు బాగా తగ్గుతూ వస్తుందని, ఇలాంటి సమయంలోను అన్విక్షకి సంస్థ (Organization for exploration) ఈ పుస్తకాన్ని తీసుకురావడం హర్షనీయమని వ్యాఖ్యానించారు. సమాజంలో చైతన్యం, మార్పు తీసుకురాగలిగే సాహిత్యానికి మరిం త మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ దిశగా పుస్తక ప్రచురణలతో పాటు డిజిటల్ మధ్య మల ద్వారా ఆడియో పుస్త కాల ద్వారా ఈ దిశగా మరింత ప్రయత్నం జరగాలని ఆకాంక్షించా రు.