–మాది ముమ్మాటికి రాజ్యాంగ బద్ధమైన విధానం
–మీది జుగుప్సాకరమైన ఫిరాయిం పుల వ్యవహారం
–అన్యాయాలు, అక్రమాలపై జాతీ యస్థాయి పోరాటానికి సిద్ధం
–ఢిల్లీలో మీడియా సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ లో అనూహ్యంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మేము నిజమని, మీరు అబద్ధమని బి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. మాది ముమ్మాటికి రాజ్యాంగ బద్ధ మైన విధానమేనని, మీది జుగుప్సా కరమైన ఫిరాయింపుల దుర్మార్గ వ్యవహారమని వ్యాఖ్యానించారు. అన్యాయాలు, అక్రమాలపై జాతీయస్థాయి (National level) పోరాటానికి ప్రణాళికా బద్ధంగా సిద్ధమవుతోన్నామని ప్రక టించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థా యిలో పోరాటం చేసేందుకు సన్న హాలు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. మాజీమంత్రి హరీశ్ రావు, ఎంపీ సురేష్ రెడ్డితో (Harish Rao, MP Suresh Reddy) కలిసి ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఫిరాయింపులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రే వంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇప్పు డెందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు.
వాటన్నింటినీ గుర్తు చేస్తూ కాంగ్రెస్ (congress) అసలు స్వరూపాన్ని బయపెట్టేందుకు జాతీయ స్థాయి లో పోరాటం చేస్తామన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారిన వారిని రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇం టింటీ వెళ్లి బీఆర్‌ఎస్ నేతలను ఎందుకు కాంగ్రెస్‌లో చేర్చుకుంటు న్నారని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 షెడ్యూల్‌ను తప్పకుండా అమలు చేస్తామనిప్రతి మీటింగ్‌లో చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతా రని నిలదీశారు. ఇప్పటికే ఏడుగు రు ఎమ్మెల్యేలను ఆరుగురు ఎమ్మె ల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకు న్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కేసు నడు స్తోందని అవసరమైతే సుప్రీంకోర్టు లో కూడా కేసు వేస్తామని గత తీర్పులను ఒక్కసారి గమనిస్తే కచ్చి తంగా బీఆర్‌ఎస్ విజయం సాధి స్తుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో (telangna) జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై లోక్‌సభ స్పీక ర్‌ను, ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర పతిని కూడా కలుస్తామని తెలి పారు.
గతంలో బీఆర్‌ఎస్ (brs)కూడా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ (Congress, TDP, BJP) నేతలను ఇలా రాజీనామాలు చేయించకుం డానే పార్టీలో చేర్చుకుంది కదా అన్న ప్రశ్నలకు కేటీఆర్ (ktr) స్పందించా రు. పార్టీ లెజిస్లేచర్‌ను విలీనం చేర్చుకోవడం వేరని నేతలు ఫిరా యించడం వేరని సమాధానం ఇచ్చారు. అది రాజ్యాంగ బద్దమని చట్టం ప్రకారం అది చెల్లుబాటు అవుతుందని వాదించారు. జాతీ య పార్టీలు చేస్తున్న ఫిరాయింపు రాజకీయాల్లో అన్నిపార్టీలు బలిప శువులే అయ్యాయన్నారు. యాం టి డిఫెక్షన్‌లా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే వలసలను ప్రోత్సహిం చిందని చరిత్ర గుర్తు చేశారు. ఇప్పు డు కూడా వంద రోజుల్లో ఆరు గ్యా రెంటీలు అమలు చేస్తామని తెలం గాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (congress) వలసను ప్రోత్సహిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆరు గ్యారెంటీలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీల ను చేర్చుకుందన్నారు. గోవా, కర్ణా టకలో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ ఇప్పుడు తెలంగాణా లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మె ల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుం టున్నారని ఎద్దేవా చేశారు. మణి పూర్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మె ల్యేను సుప్రీం కోర్టు (Supreme Court)డిస్ క్వాలిఫై చేసిందని గుర్తు చేశారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. పార్లమెంట్‌లో రాహుల్ రాజ్యాంగా న్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగా న్ని ఫాలో అవ్వరని విమర్శించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్ (ktr) ప్రశ్నించారు.