KTR Slams Central Government : కేటీఆర్ ఘాటు వ్యాఖ్య, సర్కార్ న డుపుతున్నావా, లేదంటే సర్కస్ నడుపుతున్నావా
KTR Slams Central Government : ప్రజా దీవెన, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ పై బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మం త్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చేసిన పలు వ్యాఖ్యలపై మండిపడుతూ సర్కార్ నడుపు తున్నావా లేదంటే సర్కస్ నడుపు తున్నావా అంటూ కేటీఆర్ ఘాటు వాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్ర మాణ స్వీకారం చేసిన రోజు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తు చేస్తూనే నిన్న రూ.8,29 లక్షల కోట్లు అని చె పుతున్నాడు, పూటకో లెక్క మా ట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నా డ ని విమర్శలు గుప్పించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చే సిన అసలు అ ప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క మీ లాగా కాకి లెక్క కాదు చెప్పులు ఎత్తుకపోవడానికి వేరే పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఢిల్లీకి మూటలు మోయడానికి పో తే దొంగ లెక్కనే చూస్తారు రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్, లగ్జరీ ప్రయా ణా లు అన్ని ప్రజలు చూస్తున్నారు.
ఫో ర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొ న్నావు రేవంత్ రెడ్డి నీ అన్నద మ్ము లు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యు లు అందరి ఆదాయం పెంచుకున్నా వు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు రేవంత్ రెడ్డి పెట్రోల్, డీ జిల్ ధరలు పెంచి లీటర్ రూ.200 చేసి సంపద పెంచాలని అనుకుం టున్నాడు ధరలు పెంచడం కాదు రేవంత్ రెడ్డి, బుర్ర పెంచు, సంపద పెంచే ఆలోచన చేయికోసుకొని తినడానికి నువేమన్నా మామిడి పండా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నా అంటున్నావు, దమ్ముంటే 43 సార్లు నీ ఢిల్లీ ప్రయాణాల ఖ ర్చు మీద శ్వేతపత్రం విడుదల చె య్ రేవంత్ రెడ్డి చివరిసారిగా చె ప్తున్నా రేవంత్ రెడ్డి , కేసీఆర్‌ని వ్య క్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరే స్తా అంటూ హెచ్చరించారు.తె లంగాణ భవన్‌లో కేటీఆర్ మీడి యాతో మాట్లాడుతూ తెలంగాణ సాధనలో విద్యా ర్థులు, ఉద్యోగ సంఘాల నాయ కులు పార్టీలకతీ తంగా పాల్గొన్నారని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు.
వ్యక్తిగత దూషణలు, విమర్శలు వ చ్చినా స హించామని, కానీ ఉద్య మంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యా ఖ్యలు తట్టుకోలేకపోతున్నామని కేటీఆర్ అన్నారు. ఈ 17 నెలల కా లంలో తెలంగాణ ఆస్తులు తగ్గుతు న్నయ్ ఎట్ల అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నయ్ ఎట్ల అం టూ ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసింది అంటున్నవ్ మరి నీ కుటుం బం ఆస్తులు ఎట్ల పెరుగు తున్నా యని కేటీఆర్ అడిగారు. రేవంత్ రె డ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే చే తకాని వాడిని తేలిపో యిందన్నా రు. కాంగ్రెస్ హామీలు శతాబ్దపు అ బద్ధంకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేసే అబద్ధాలుగా తేలిపోయాయ ని, తాము ఎప్పటి నుంచో ఢిల్లీ పార్టీలను నమ్మరాదని చెబుతున్నామని కేటీఆర్ అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ, పలు హామీలు నెర వేర్చకుండా ప్రజ లను మోసం చే స్తోందని ఆరోపించారు.
ఉద్యమ సమయంలో ఉద్యోగ సం ఘాలు, ముఖ్యంగా ఎ న్‌జీఓలు కీ లకంగా కదం తొక్కాయన్నారు. వారి పోరాటం వల్లే తెలంగాణ రా ష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశా రు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఉద్యమ నే తలకు గౌరవంగా ఉ న్నత జీతాలు కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో భాగం కాలేదని, ఉ ద్యమ ద్రోహిగా వ్యవహ రిస్తున్నా రని ఆరోపించారు.
అన్నింట్లో మితిమీరిన అస్ప ష్టత… ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థి తిపై ఇస్తున్న లెక్కల్లో అస్పష్టత ఉం దన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదే ళ్లలో చేసిన అప్పు మొత్తం 4.15 లక్షల కోట్లకే పరిమితమని, ప్రభు త్వం నుండి విరమించిన సమ యంలో ఆదాయం నెలకు 18 వేల కోట్లు ఉందని వివరించారు. ఇప్పు డూ అదే ఆదాయం వస్తున్నా, కాం గ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించలేకపోతోందని వి మర్శించారు. కాంగ్రెస్ నేతలు శ్వేత పత్రాలు విడు దల చేస్తూ అప్పు లె క్కల్ని గందర గోళంగా మార్చుతు న్నారని, ఒక సారి 6 లక్షల కోట్లు, తర్వాత 8.29 లక్షల కోట్లు అంటూ లెక్కల్లో అస్ప ష్టతగా చూపుతు న్నారన్నారు.అన్ని రంగాల్లో సంక్షో భంకేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిం దని, ఇప్పుడు అన్నిరంగాల్లో సం క్షోభం నెలకొందని కేటీఆర్ అన్నా రు.
రైతు బంధు, విద్యుత్ సరఫరా, నీ టి కొరత వంటి అంశాల్లో కేసీఆర్ హయాంలో స్థిరత ఉందని, ఇప్పు డు అన్ని రంగాల్లో సంక్షోభం నెల కొంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చే శారని విమర్శలు గుప్పించారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరి స్తామని చెప్పి, ఇప్పుడు వారినే ప్రజల ముందు విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యా నించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గా డిలో పెట్టిన కేసీఆర్ పాలన తరు వాత ఇప్పుడు విపరీత పరిస్థితు లు నెలకొన్నాయని, ప్రజలు ఈ ప రిస్థితిని గమనిస్తున్నారని అన్నా రు.