–అభినందించిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి
District Collector Ila Tripathi :
ప్రజాదీవెన నల్గొండ: టీబీ కేసులను అప్పటికప్పుడే నిర్ధారించేందుకు ఉద్దేశించి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్ టి బి ఎక్స్రే పరికరానికి ఆర్థిక సహాయం అందించిన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. ఈ మేరకు మిర్యాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్, జిల్లా రైస్ మిల్లర్లు మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ను కలిసి ఏ ఐ టి బి మొబైల్ ఎక్స్ రే మిషన్ నిమిత్తం 18 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజల వైద్య సేవల కు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చి అత్యాధునిక ఏఐ టీబి మొబైల్ ఎక్స్ రే యంత్రానికి సహకారం అందించడం అభినందనీయమని అన్నారు.ఈ ఎక్స్రే యంత్రం ద్వారా అక్కడికక్కడే రోగికి పరీక్షలు నిర్వహించి టీబీని నిర్ధారించవచ్చని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష్యులు శ్రీనివాస్ కార్యదర్శి వెంకట రమణ చౌదరి, ఉపాధ్యక్షుడు గంటా సంతోష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, నల్గొండ సంఘం అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి భద్రాద్రి తదితరులు ఉన్నారు.