— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Encroachments in Lakes and Ponds : ప్రజా దీవెన నల్లగొండ: చెరువులు ,కుంటలలో ఆక్రమణల కు పాల్పడితే కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. చెరువులు, కుంటల్లో ఆక్రమణలు జరగకుండా కట్టుదిట్ట మైన చర్యలు తీసుకోవాలని అన్నా రు.శుక్రవారం ఆమె ఉదయాదిత్య భవన్లో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధి కారులు, తహసిల్దార్లతో జిల్లా వ్యా ప్తంగా చెరువులు, కుంటల ఆక్రమ ణలపై సమీక్ష నిర్వహించారు.
గతంలో జరిగిన ఆక్రమణలను తక్ష ణమే అరికట్టాలని, కొత్తగా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లు, పర్మిషన్ల ను నీటిపారుదల శాఖ పూర్తిస్థా యిలో పరిశీలించిన తర్వాతే ఇవ్వా లని ఆదేశించారు. ఎక్కడైనా చెరు వులను ఆక్రమిస్తే వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పారు. ఇకపై జిల్లాలో ఎలాంటి ఆక్రమణలు జరగరాదని, నిర్మాణాలు అసలే జరగరాదని చెప్పారు. ఇకపై నిర్మా ణాల అనుమతి విషయంలో తహ సిల్దారులు ,ఆర్టీవోలు తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ నుండి “నో అబ్జెక్షన్ “సర్టిఫికెట్ ను తప్పనిసరిగా తీసు కునే విధంగా చూడాలన్నారు.
లేఔ ట్ పర్మిషన్లు, ఇంటి నెంబర్ల వి షయమై కచ్చితంగా వ్యవహరిం చా లని స్థానిక సంస్థల అదనపు కలె క్ట ర్ ను ఆదేశించారు. మిర్యాలగూడ డివిజన్లో ఇరిగేషన్ చెరువులకు సం బంధించి సర్వే ను త్వరితగతిని పూర్తి చేసి,జియా కోఆర్డినేటర్స్ త యారుచేసి ఒక మోడల్ డివిజన్ గా తయారు చేయాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ను ఆదేశించా రు .
రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమి త్, దేవరకొండ ఆర్డిఓ రమణా రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి పర్వ తీశ్వ రరావు,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి సుజాత, తహసిల్దారులు హాజర య్యారు.