–పైలట్ ప్రాజెక్టు అమలు సమాలోచ నల్లో ఆయా రాష్ట్రాలు
–ఒడిశా, బెంగాల్‌లలో అమలులో మద్యం హోం డెలివరీ విధానం
–డోర్ డెలివరీతో 20 నుంచి 30 శాతం పెరిగిన విక్రయాలు
Liquor home delivery: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: డోర్ డెలివరీ (door delivery)తో ప్రజలు పొందుతున్న సేవలు అంతా ఇంతా కాదు ఈ రోజుల్లో. అది ఇది కాకుండా ఏది అంటే అది ఈ రోజుల్లో సర్వీస్ చార్జీలతో (service charges) మనింటికి క్షణాల్లో చేరుతున్న విషయం విదితమే. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ (Swiggy, Zomato, Big Basket, Blinkit) లాంటి హోం డెలివరీ యాప్ ల ద్వారా ఇప్పటికే సకల ఐటమ్స్ మన చెంతకు చెరుస్తున్న డోర్ డెలి వరీ సంస్థలు అందరు అనుకుం టు న్నట్లు మద్యం సరఫరాకు శ్రీకారం చుట్టబోతున్నాయి. మద్యాన్ని కూడా హోం డెలివరీ (Home delivery)చేసేందుకు అనుమతించాలని ఢిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళ నాడు, గోవా, కేరళ రాష్ట్రాలు సమాలోచనలు చేస్తున్నాయి. తదనుగుణంగా పైలట్ ప్రాజెక్టుకు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ మేరకు జాతీయ వార్తా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.
పరిశ్రమ వర్గాలు ఈ విషయాన్ని తెలిపినట్లు అందులో పేర్కొంది. ఆయా రాష్ట్రా ల అధికారులు ఇప్పటికే ఫుడ్ డెలి వరీ యాప్‌లతో, మద్యం తయారీ సంస్థలతో (Liquor manufacturing company) సంప్రదింపుల్లో ఉన్నా రని, మద్యం హోం డెలివరీ వల్ల కలిగే లాభనష్టాలపై అంచనా వేస్తు న్నారని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత బీర్, వైన్ లాంటి తక్కువ ఖరీదైన మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చే అవకాశం ఉందని తెలిపింది. నగరా ల్లో జీవనశైలి మారుతోందని, పురు షులతో పాటు చాలా మంది మహి ళలు మద్యం సేవిస్తున్నారని, వైన్ షాపులకు వెళ్లి మద్యం కొనలేని మహిళలకు హోం డెలివరీ నిర్ణయం ఉపకరిస్తుందని వివరించింది. ఒడి శా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఇప్ప టికే మద్యం హోం డెలివరీ వెసులు బాటు ఉంది.
బెంగాల్‌లో స్విగ్గీ, స్పెన్సర్స్ రిటైల్ సంస్థలు(Swiggy and Spencer’s are retail companies) మద్యాన్ని ఇంటికి సరఫరా చేస్తున్నాయి. హోం డెలివరీ సేవలు ప్రారంభించాక ఈ రెండు రాష్ట్రాల్లో మద్యం అమ్మ కాలు 20 నుంచి 30 శాతం పెరి గినట్లు అంచనా వేశాయి. ఇదిలా ఉండగా, హోం డెలివరీకి అన్ని నిబంధనలు పాటిస్తామని, వయ సును ధ్రువీకరించుకొన్న తర్వాతే, పరిమితి మేరకే డెలివరీ ఉంటుం దని స్విగ్గీ కార్పొరేట్ ఆఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ దిన్‌కర్ వశిష్ఠ్ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ ప్రస్తావించింది.