–తుంగతుర్తి కోర్టు న్యాయమూర్తి గౌ స్ పాషా
Court Judge Gaus Pasha : ప్రజా దీవెన, తుంగతుర్తి: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని తుంగ తుర్తి కోర్టులో శనివారం ఘనంగా ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి కోర్టు జడ్జి గౌస్ పాషా క క్షిదారులను ఉద్దేశించి ప్రసంగించా రు. చిన్నచిన్న తగాదాలతో ఆవేశం తో ఘర్షణలు పడి కొట్టుకొని కేసు ల కు రావడం వల్ల ఇరు పక్షాల వారు ఆర్థికంగా మానసికంగా నష్టపోయి కృంగిపోతారని అన్నారు అందుకే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కేసులను త్వరగా పరి ష్కారం చేసి వారి ఆర్థిక భారాన్ని వాళ్ళ సమయాన్ని వాళ్ళ మానసిక స్థితిని కాపాడేందుకు కృషి చూస్తు న్నామని అన్నారు.
అదేవిధంగా కోర్టులో గెలిస్తే ఒక్కరే గెలుస్తారని అదే రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఇద్దరు గెలుస్తారు అని చెప్పారు. లోకదాల త్ కార్యక్రమంలో కేసుల పరిష్కారా నికి సహకరించిన అందరికీ కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్భంగా లోకదాలత్ కార్యక్రమానికి కోర్టుకు హాజరైన కక్షిదారులందరికీ భోజనం మంచినీరు ఏర్పాటు చేయడం జరి గింది.
ఈ కార్యక్రమంలో బార్ అసోసి యే షన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞానసుం దర్, వైస్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు సెక్రటరీ ఎం రవి కుమార్ ట్రెజరర్ బి సతీష్ వజీర్ నాగరాజు చం ద్రమౌ ళి శ్రీనివాస్, తుంగతుర్తి నాగారం సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.