Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Loan waiver:కుటుంబoకు రూ. 2లక్షలు రుణమాఫీ

–2 లక్షలకు మించి ఉంటే ఆపై మొ త్తాన్ని రైతులే భరించాలి
–2018 డిసెంబరు 12 నుంచి 20 23 డిసెంబరు 9 మధ్య రుణాలకే
–లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగ దు బదిలీ పద్ధతిలో జమ
–యజమాని, భార్య,భర్త, పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణన
–కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం
–రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తంలో మాఫీ
–రుణమాఫీ పథకం మార్గదర్శకాల ను విడుదల చేసిన ప్రభుత్వం

Loan waiver:ప్రజా దీవెన, హైదరాబాద్‌: రైతన్నల (farmers) ఎదురు చూపులకు ఉపశమనం లభించింది. అన్న దాతలు ఎప్పు డెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి అధికారిక మార్గదర్శకాలు విడుదల య్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ (Debt and interest) మొత్తం కలిపి కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా మని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధ తిలో జమ చేస్తామని పేర్కొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో అప్పు తీసుకున్న రైతుల రుణమాఫీ (Loan waiver)మొత్తాన్ని డీసీసీబీ ఖాతాల్లో జమ చేస్తా మని తెలిపింది. 2018 డిసెం బరు 12 నుంచి 2023 డిసెంబరు 9 నా టికి రైతుల పేరిట ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించింది. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహా ర భద్రత కార్డును పరి గణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. రాష్ట్రం లో ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాం కులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాం కులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లు, వాటి శాఖల్లో తీసుకు న్నస్వల్ఫ కాలిక పంట రుణాలను మాఫీ (Loan waiver)చేయ నున్నట్లు తెలిపింది. రుణ మాఫీ మొత్తాన్ని ఆధారంగా చేసుకొ ని ఆరోహణ క్రమంలో (తక్కువ నుంచి ఎక్కువ) మాఫీ చేస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం–కిసాన్‌ మినహాయిం పులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా (data) మేరకు పరిగణనలోకి తీసు కుంటామని పేర్కొంది. ఈ మేరకు రుణమాఫీ పథకానికి సంబంధించి న మార్గదర్శకాలపై జీవో ఆర్టీ నం బరు 567ను రాష్ట్ర వ్యవసా యశా ఖ కార్యదర్శి రఘునందన్‌ రావు సోమవారం జారీ చేశారు.

రుణమాఫీ పథకo వర్తింపు ఇలా..

–తెలంగాణలో (telangana) భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తిస్తుంది. స్వల్ఫకాలిక పంట రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.

● రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు(ఉమ్మడి బ్యాంకులు), వాటి శాఖ (బ్రాంచి)ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ పథకం వర్తిస్తుంది.2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వ తేదీ నాటికి మంజూరైన, రెన్యువల్‌ అయిన, రుణ బకాయిలకు వర్తిస్తుంది. బకాయి ఉన్న అసలు, వర్తించే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.

● రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ జారీ చేసిన ఆహార భద్రత కార్డు డేటాబేస్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.

● కుటుంబ యజమాని, జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు.

రుణమాఫీ (Loan waiver)పథకాన్ని అమలు చేస్తారిలా..

● రుణమాఫీ (Loan waiver) మొత్తాన్ని డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో నేరుగా లబ్ధిదారులైన రైతు రుణ ఖాతాలకు జమ చేస్తారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్న రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీలకు గానీ, వాటి పరిధిలోని బ్రాంచిలకుగానీ విడుదల చేస్తారు. ఆ బ్యాంకర్లు రుణమాఫీ మొత్తాన్ని వారి పరిధిలో ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

● ప్రతి రైతు(faremr) కుటుంబానికి 2023 డిసెంబరు 9 నాటికి ఉన్న మొత్తం రుణం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ సొమ్మును జమ చేస్తారు. మొత్తం రుణం గానీ, లేక రూ.2 లక్షల వరకు గానీ.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.

● రూ.2 లక్షలకు మించి రుణం ఉంటే.. ఆ రైతు రూ.2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత కలిగిన 2 లక్షల మొత్తాన్ని రుణ ఖాతాకు బదిలీ చేస్తారు.

● రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో.. కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు.

● పథకం అమలుకు ఏర్పాట్లు, కసరత్తు, షరతులు

● వ్యవసాయశాఖ కమిషనర్‌/డైరెక్టర్‌ను పంట రుణమాఫీ– 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా ప్రభుత్వం నిర్ణయించింది.

● హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

● వ్యవసాయశాఖ డైరెక్టర్‌(Director of Agriculture), ఎన్‌ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తారు. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్‌ అకౌంట్‌ డేటా సేకరణ, డేటా వ్యాలిడేషన్‌, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ పోర్టల్‌లో ఆర్థిక శాఖ నిర్వహించే ‘ఐఎఫ్‌ఎంఐఎస్‌’ పోర్టల్‌కు బిల్లుల సమర్పణ, పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మాడ్యూల్స్‌ ఉంటాయి.

● ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని ‘బ్యాంకు నోడల్‌ అధికారి’(బీఎన్‌వో)గా నియమిస్తారు. ఈ నోడల్‌ అధికారి.. బ్యాంకులకు, వ్యవసాయశాఖ డైరెక్టర్‌, ఎన్‌ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

● రుణమాఫీ పొందటానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినా, మోసపూరితంగా పంట రుణాన్ని పొందినా, పథకానికి అర్హులు కాదని తేలినా.. రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనిని రికవరీ చేసే అధికారం వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు ఉంటుంది.

● రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించఢానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్‌ లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలిపే అవకాశం కల్పించారు. ప్రతి అభ్యర్థనను 30 రోజుల్లోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలపాలి.

రుణమాఫీ వీటికి వర్తించదు..

రుణమాఫీ పథకం (Loan waiver scheme) వర్తించ నివి ఇలా .. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల)కు, జాయింట్‌ లయబిలిటీ గ్రూప్‌ (జేఎల్‌జీ)లు, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ (ఆర్‌ఎంజీ)లు, లోన్‌ ఎలిజి బిలిటీ కార్డ్‌ స్కీం (ఎల్‌ఐసీఎస్‌)లకు తీసుకున్న రుణాలకు వర్తించదు.

● పునర్‌వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు రుణమాఫీ పథకం వర్తించదు. ప్రకృతి విపత్తులు సంభవించి.. రైతులకు తీరని నష్టం కలిగిన ప్పుడు ఆ ప్రాంతంలో రైతులు తీసుకున్న పంట రుణాలపై ప్రభుత్వ మారిటోరియం ప్రకటిస్తే అది రీషెడ్యూలు కిందకు వస్తుంది. అప్పుడా రుణాలు స్వల్ఫకాలం నుంచి దీర్ఘకాలిక రుణాల జాబితాలోకి వెళ్తాయి.

● కంపెనీలు, ఫర్మ్‌లు (Companies, Firms)వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. పీఏసీఎస్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.

● కేంద్రం అమలు చేసే పీఎం–కిసాన్‌ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా లభ్యత మేరకు.. ఆచరణాత్మకంగా అమలు చేయడానికి వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు.