–దాదాపు రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయి
–ఆర్ధిక నిపుణులు రుణ మాఫీ కష్ట మని చెప్పినా మాట నిలబెట్టుకుం టున్నాం
–గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమంగా అమలు చేస్తారు
–రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Loan waiver:ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు రుణమాఫీపై (farmer loan waiver) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రానికి రైతుల రుణా లు మాఫీ చేస్తామని దాదాపు రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని తెలిపారు. బుధవారం ప్రజాభవన్‌లో పీసీసీ కార్యవర్గ (PCC Working Group)సమావేశంలో ఈ మేరకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ సమా వేశంలో పలు కీలక అంశా లపై చర్చ జరుగగా ముఖ్యంగా రైతు రుణమా ఫీపై చర్చ జరిగింది. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా తెలిపారు. పదేళ్లు అధికా రంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ (farmer loan waiver) చేయలేకపోయార న్నారు.
రాహుల్ మాటఇచ్చారంటే…
ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ (farmer loan waiver) చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో చెప్పామని అన్నారు. అ యితే ఆర్ధిక నిపుణులు కూడా రు ణమాఫీ కష్టమని చెప్పారని ప్రభు త్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర వుతాయన్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోని యమ్మ తెలంగాణ ఇచ్చారని, పార్టీ కి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ (Sonia Gandhi)ఆనాడు సాహసోపేత నిర్ణ యం తీసుకున్నారని గుర్తుచేవారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు. రైతు రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్య తన్నారు.
ప్రతీ రైతును రుణ విముక్తి చేస్తాం… వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్‌ను దేశం అను సరించేలా ఉండాలని చెప్పుకొచ్చా రు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు రేపు సాయం త్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తు న్నామని సీఎం ప్రకటన చేశారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి (farmer loan waiver)వెళతాయన్నారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్‌లాగా (kcr) మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. అందుకే ఏకమొత్తం లో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌర వాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ (farmer loan waiver) అని చెప్పుకొచ్చా రు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని సమావేశం లో సీఎం తెలిపారు.
సంబరాలు జరుపుకుందాం .. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో (Village, Mandal, Constituency level) కార్యక్రమాలు నిర్వ హించాలన్నారు. రుణమాఫీ హామీ ని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలన్నారు. రుణమాఫీపై జాతీ యస్థాయిలో చర్చ జరగాలని తెలి పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు. రాహు ల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమ లు చేశామని పార్లమెంట్‌లో ఎంపీ లు ప్రస్తావించాలన్నారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని నేతలకు తెలిపారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలన్నారు. ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్ల డించారు. ఈ సమావేశంలో ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు (MLAs, MLCs, MPs, Congress leaders) హాజర య్యారు.