–దేశంలో తొలిసారి లోక్ సభ స్పీకర్ కు ఎన్నికలకు సిద్దం
–స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడు దల నేపథ్యంలో రాజకీయం
–విపక్షాల తరఫున కాంగ్రెస్ అభ్యర్థి సురేష్, ఎన్టీఎ అభ్యర్ధిగా మాజీ స్పీ కర్ ఓం బిర్లా నామినేషన్ ల దాఖ లు
–కొనసాగుతున్న రాజకీయ ఉత్కం ఠ భరిత వాతావరణం
Lok Sabha Speaker elections:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో (Lok Sabha Speaker elections) రాజకీయపరమైన ఉత్కంఠ వాతావరణం కొనసాగు తోంది. పోటీకి విపక్ష కూటమి సైతం సిద్ధo కాగా విపక్షాల తరఫున కాం గ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ (Nomination of MP Suresh)వేశా రు. దీంతో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగను న్నాయి. ఇప్పటి వరకు స్పీకర్ ఎన్ని క ఏకగ్రీవంగా వస్తుండగా గతంలో అధికార పక్షానికి స్పీకర్ ఉండగా ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. యూపీఏ-1, యూపీఏ-2 ఇదే విధానాన్ని అమ లు చేసిన విషయం కూడా విజిత మే. యూపీఏ-1 హయాంలో బీజేపీ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ (BJP MP Charanjeet Singh), యూపీఏ-2 లో బీజేపీ ఎంపీ కరియా ముండా డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. కానీ గత పదేళ్లలో ఎన్డీయే తొలి టర్మ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా మిత్ర ప్రతిపక్షా నికి కాషాయ పార్టీ అవకాశం ఇచ్చింది. రెండో టర్మ్‌లో ఆ పోస్ట్‌ను ఖాళీగానే ఉంచింది. తాజాగా విప క్షాల తరఫున కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ నామినేషన్ దాఖలు చే యడంతో తదుపరి ఏం జరగబో తుందన్నది ఆసక్తిగా మారింది. మ రో వైపు స్పీకర్ పదవిపై ప్రతిపక్ష నేతలతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై ఏకా భిప్రాయం కోసం రాజ్ నాథ్ మం తనాలు కొనసాగిస్తున్నారు. విప క్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వ కపోయినట్లయితే స్పీకర్ పదవికి ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నది. పార్లమెంట్ దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపి స్తోంది.
జూన్ 26న జరగనున్న స్పీ కర్ ఎన్నికకు ఒకరోజు ముందు మంగళవారం ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే (nda) ప్రకటించే అవకాశముంది. ఇదిలా ఉంటేపార్లమెంటు దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ (New Speaker of Lok Sabha) ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపి స్తోంది. జూన్ 26న జరగనున్న స్పీక ర్ ఎన్నికకు ఒకరోజు ముందు మం గళవారం ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే ప్రకటించే అవకాశ ముంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ సంప్ర దింపులను ముమ్మరం చేసింది. ఎన్డీఏలోని తమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసు కుంటోంది. అయితే మాజీ స్పీకర్ (Speaker )ఓం బిర్లా మరోసారి స్పీకర్ కాబోతున్నారా లేదంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి పురంధే శ్వరి స్పీకర్ సీట్లో కూర్చోబోతు న్నారా అన్న రాజకీయ వర్గాల్లో ఆలోచనలకు తెరదించుతూ ఒంబి ర్లనే అధికార పక్ష స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించడం నామినేషన్ దాఖలు చేయడంతో ఊపిరి పిలుచుకున్నా రు. గతంలో ఎవరూ ఊహించని నేతలను తెరపైకి తెచ్చింది బీజేపీ నాయకత్వం. ఈసారి కూడా బీజేపీ నిర్ణయించే అభ్యర్థికే తమ మద్దతు అని మిత్రపక్షాలు ప్రకటించాయి. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చిన ప్పటి నుంచి కూడా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుంది.
అయితే ఎన్డీయే మాజీ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) పేరు మరోసారి పరిశీలనలో ఉన్నప్పటికీ విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నం దున ప్రతిపక్షాలకు ఏమాత్రం అవ కాశం ఇవ్వకూడదని బీజేపీ భావి స్తోంది. 18వ లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్ నియమితులయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వరకు ఆయ న లోక్‌సభ ప్రిసైడింగ్ అధికారి బా ధ్యతలను నిర్వర్తిస్తారు. కొత్త లోక్ సభ స్పీకర్ ఎన్నికను ఆయనే నిర్వ హిస్తారు. లోక్‌సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత ప్రధాని తన మంత్రి మం డలిని సభకు పరిచయం చేయను న్నారు. జూన్ 27న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావే శంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూన్ 28న చర్చ ప్రారం భం కానుంది. జులై 2 లేదా 3న చర్చకు ప్రధాని సమాధానం ఇస్తా రని భావిస్తున్నారు.