–నీట్ పేపర్ లీకేజీపై అట్టుడికిన లోక్ సభ
–పరీక్షల వ్యవహారం యావత్ పచ్చి మోసం
–పరీక్షా విధానం పై అధికార పక్షా న్ని దులిపేసిన విపక్షనేత రాహుల్
–విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Lok Sabha:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Sessions of Parliament) ప్రారంభం రోజే ‘నీట్’ పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారని, దేశంలో పరీక్షల వ్యవహా రం యావత్ పచ్చి మోసంగా మారిందన్నారు.
డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థను కొనేస్తున్నారని లక్షలాది మంది ప్రజలు నమ్ము తున్నారని, విపక్షాల అభిప్రాయం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ‘నీట్’ పరీక్షా పత్రం లీకేజీ అంశాన్ని రాహుల్ లేవనెత్తుతూ, పేపర్ లీక్ పై మంత్రి తనను తప్ప అందరినీ నిందించారని అన్నారు. ‘నీట్’ విషయంలోనే కాకుండా మన పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమ స్య ఉందని యావద్దేశానికి స్పష్టంగా అర్థమైందని, అయితే మంత్రి మాత్రం తనను తాను మిన హాయించుకుని అందరినీ నిందిం చారని అన్నారు. అసలిక్కడ ఏమి జరుగుతోందో దాని మౌలిక సూత్రా లను కూడా ఆయన అర్ధం చేసు కున్నట్టు తనకు అనిపించడం లేద న్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కేంద్రంపై విమ ర్శలు గుప్పిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టిం చిందని అన్నారు. కొన్ని సెంటర్లలో 2000 మందికి పైగా పాసయ్యారని, విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఉన్నంత వరకూ విద్యార్థులకు న్యాయం జరగదని అన్నారు.నీట్ ప్రశ్నాప త్నం లీకేజీ వ్యవహారంపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభు త్వం ఏదీ దాచిపెట్టడం లేదని, నిజా నిజాలను సుప్రీంకోర్టుకు తెలియజే సిందని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకో ర్టు విచారణలో ఉందని చెప్పారు. కోర్టు ఇచ్చే ఆదేశాల గురించి మనం ఎదురుచూద్దామని చెప్పారు.
ఈ ఏడాది మే 5న నీట్ – యూజీ (neet ug)పరీక్ష జరిగినప్పుడు పాట్నాలో పేపర్ లీక్ (paper leak) చోటుచేసుకోవడం మినహా గత ఏడేళ్లలో ఎలాంటి పేపర్ లీకేజీలు లేవన్నారు. ప్రస్తుతం నీట్ పేపర్ లేకేజీ వ్యవహారంపై సీజేఐ నేతృ త్వంలో విచారణ జరుగుతు న్నందున వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పటి నుంచి 240కి పైగా పరీక్షలు నిర్వహించడం జరి గిందని, 5 కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.5 కోట్ల మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే సర్కా రు మూడోసారి కొలువుదీరిన తర్వాత సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తోన్న నీట్ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర (Dharmendra) ప్రధాన నీట్ అంశంపై మాట్లాడుతుంటే.. విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే కావడి (కన్వర్) యాత్ర మార్గంలో హోట ళ్లపై యజమానుల పేర్లు రాయా లంటూ ఉ త్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనను విప క్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీ సులను ఛైర్మన్ జగదీప్ ధనఖడ్ తిరస్కరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెం గాల్లోని అసన్సోల్ నుంచి శతృఘ్న సిన్హా ఎంపీగా విజయం సాధించా రు. ఆయన జూన్ లో జరిగిన పార్ల మెంట్ సమావేశాల సమయంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయలే కపోయారు. ఇప్పుడు సభ ప్రారం భం కాగానే ఆయన ప్రమాణం చేశారు.