Lover Attack: ప్రజా దీవెన, కరీంనగర్: కనికరం లేని మసతత్వం కలిగిన ఓ యు వకుడు తల్లితో సమానంగా చూ డాల్సిoదిపోయి ప్రియురాలి తల్లిని చితకబాదాడు. తమ ప్రేమకు అడ్డో స్తుందనే కారణంతో ప్రియురాలి తల్లిపై దారుణంగా దాడి చేశాడు సదరు ప్రేమోన్మాది. గొంతు పై తొక్కుతూ, పిసుకుతూ చంపినంత పని చేశాడు. జరిగిన సంఘటన కథాకమీషు ఇలా ఉంది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నా రం అనుబంధ గ్రామమైన సుద్దాల పల్లిలో తమ ప్రేమకు అడొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లి చామం తిపై దాడి చేసి గొంతు పిసికి చంప డానికి ప్రయత్నం చేశాడు. సుద్దాల పల్లి గ్రామానికి చెందిన దూట రాజ్ కమార్, జాడి సుస్మిత అనే యువ తితో కొంతకాలంగా ప్రేమ కొనసాగి స్తున్నాడు. ఇది గమనించిన కూతు రు సుష్మితను తల్లి చామంతి మం దలించింది. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూ తురు మనసు మార్చిoది ఆ తల్లి.
తమ ప్రేమకు అడ్డు వస్తుందనే నెపంతో ఎలాగైనా తనను చంపాల నే కసితో బహిరంగంగానే చామం తిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి రాజకుమార్ చంపే ప్రయత్నం చేశా డు. స్థానికులు రాజ కుమార్‌ను అ డ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బాధితురాలు బయటపడిoది. పో లీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Young man attack on lovers mother pic.twitter.com/r69dQ0Riib
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 2, 2025