Maharashtra Assembly Elections: మహారాష్ట్ర పై కాంగ్రెస్ ఫోకస్.. ఎన్నికల ప్రచార వ్యూహం పై ఏ.ఐ.సి.సి పరిశీలకుల భేటి
Maharashtra Assembly Elections: ప్రజా దీవెన, ముంబాయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై (Maharashtra Assembly Elections) కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రచార వ్యూహంపై ఏఐసీసీ పరిశీలకులు ముంబైలో శనివారం రాత్రి పొద్దుపోయే వరకు వరకు కొనసాగిన భేటీ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భుపేష్ బఘేల్,చరణ్ జిత్ చన్నీ (Ashok Gehlot, Bhupesh Baghel, Charan Jit Channi) లతో పాటు మాజీ ఉప ముఖ్య మంత్రులు టి.యస్.సింగ్ దేవ్, పరమేశ్వరన్ తదితరులు సమాలోచనలు జరిపారు.
మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్ని తాల (Ramesh Chenni Tala) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఎన్నికల పరిశీల కులు గా నియమితులైన నీటి పారుదల,పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), పంచాయతీరాజ్ శాఖామంత్రి సీతక్క, యం.బి.పాటిల్ తది తరులు సైతం సమాజంలో పాల్గొన్నారు. నవంబర్ లో జర గనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కిం చుకునేందుకు గాను కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తుంది.అందులో భాగంగా శనివారం అర్ధరాత్రి పొద్దు పోయేంత వరకు ఆ పార్టీ సీనియర్ నేతలు రాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్నికల ప్రచార వ్యూహానికి ప్రణా ళికలు రూపొందించారు. ముందె న్నడూ లేని రీతిలో ఆ పార్టీ సీని యర్లను,అనుభవజ్ఞులైన నేతలను రంగంలోకి దింపింది.మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల అధ్యక్షతన శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశంలో అధికార బిజేపి, షిండే ఆద్వర్యంలోని శివసేన లను ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి దోహదపడే అంశాలపై అబిపార్టీ యంత్రాంగం దృష్టి సారించింది.
ఈ సమావేశంలో ఆ పార్టీకీ చెందిన సీనియర్లు, అపార ఆనుభజ్ఞులు (Seniors, experienced ) అయిన మాజీ ముఖ్యమంత్రి అశో క్ గెహ్లాట్, భుపేష్ బగేల్ ,చర ణ్ జిత్ చన్నీ లతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.యస్.సింగ్ దేవ్,పరమేశ్వరన్ లు,ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్క లు పాల్గొన్నారు. మహా రాష్ట్ర లో అధికారంలో ఉన్న శివ సేన(షిండే)బిజెపి ల కూటమి ని ఎదుర్కోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేం దుకు గాను ఈ సమావేశం కసరత్తు చేసింది.