Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University:స్కిల్ డిజైనర్ టెక్నాలజీ ప్రైవేట్ లి మిటెడ్ కంపెనీతో ఎంజియు అవ గాహన ఒప్పందం

Mahatma Gandhi University: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ డిజైనర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారితో అవగాహన ఒప్పందం చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఎం జియూ కళాశాలలు మరియు అను బంధ కళాశాలల విద్యార్థులకు నై పుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉచితంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతిని ధులు తెలిపారు. ఈ కార్యక్రమాల లో ప్రధానంగా విద్యార్థులకు అ ధ్యాపకులకు సైతం ఉపయుక్తమైన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేసినట్లు తద్వారా ఫ్యాకల్టీ డెవలప్మెంట్,ఇంటర్ షిప్లు, వర్క్ షాప్ లు అందించనున్నారు.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆ చార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మా ట్లాడుతూ ప్రతి విభాగంలోని వి ద్యార్థులకు ఉపయుక్తమైన కార్య క్రమాలను రూపొందించడం ఆహ్వా నించదగ్గ విషయం అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ ని పోటీ ప్రపంచంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఆల్వాల రవి, ఐక్యుఏసి డైరెక్టర్ డా మిర్యాల రమేష్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ డా తిరుమల, వివిధ కళా శాలల కోఆర్డినేటర్లు డా.అభిలాష, డా స్వప్న, డా శ్రవణ్, అశ్విని , సం స్థ ప్రతినిధులు శ్రీకాంత్ ముప్పాల పాల్గొన్నారు.