Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University : మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ కీలక వ్యాఖ్య, క్రీడలతో పరిపూర్ణ మూర్తిమత్వం

Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా ది నోత్సవం పురస్కరించుకొని తలపె ట్టిన 3 రోజుల కార్యక్రమాలలో శుక్ర వారం ఉదయం మూడు కిలోమీట ర్ల పరుగు పందెం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ని ర్వహించిన మూడు కిలోమీటర్ల ప రుగు పందెంలో 70 మంది విద్యా ర్థులు పాలుపంచుకోగా గెలుపొంది న వారికి ఉపకులపతి ఆచార్య కా జా అల్తాఫ్ హుస్సేన్ తో పాటు రిజి స్ట్రార్ ఆచార్య అలువాల రవి బ హుమతులు ప్రధానo చేశారు. అ నంతరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం లోని సెమినార్ హాల్లో స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డా హరీష్ కుమార్ అధ్యక్ష తన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి మరియు జిల్లా స్పోర్ట్స్ అధికారి మ హమ్మద్ అక్బర్ అలీ విచ్చేసి విద్యా ర్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆచా ర్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లా డుతూ విశ్వవిద్యాలయంలో ఉన్న త ప్రమాణాలతో క్రీడ ప్రాంగణాలను ఏర్పాటు చేశామని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని జా తీయ అంతర్జాతీయ స్థాయిలో రా ణించాలని పిలుపునిచ్చారు. క్రీడ లు మానసిక ఉల్లాసంతో పాటు పరి పూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందిం చే సాధనాలని గుర్తు చేశారు. ఎంజీ యూలో క్రీడలకు సైతం రెండు క్రెడి ట్లను అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మొబైల్ వా డకం కన్నా దేహదారుడ్యం మరి యు మానసిక ఉల్లాసం నాయకత్వ లక్షణాలను పెంపొందించి సంఘజీ వనానికి, సహకారాలకు పునాది లాంటి క్రీడలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

అనంతరం జిల్లా స్పోర్ట్స్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ మాట్లాడు తూ ఉత్తమ సదుపాయాలు కలిగిన ఎంజీయూలో జాతీయస్థాయి క్రీడా కారులను తయారు చేయాలని అం దుకు తగిన శిక్షణలు, ఖేలో ఇండి యా వంటి క్రీడాలను నిర్వహించేం దుకు సహాయ సహకారాలు అందిం చనున్నట్లు తెలిపారు. జాతి నిర్మా ణంలో యువత పాత్ర కీలకమని, వారి చలన శీలత బుద్ధి పుశలతకు క్రీడలు దోహదపడతాయని గుర్తు చే శారు. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ క్యాలెండర్ మరియు ఎంజీయూలు మొట్టమొ దటిసారిగా వివిధ అంశాలలో స్పో ర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య అల్వాల రవి అధ్యాపకులు, డా రామావత్ మురళి, డా వై శ్రీనివాస రెడ్డి, కోఆర్డినేటర్ శివశంకర్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొ న్నారు.

*సెప్టెంబర్ 15 న ఎంజియూ 4వ స్నాతకోత్సవం* ….మహాత్మా గాం ధీ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాత కోత్సవాన్ని సెప్టెంబర్ 15 న నిర్వ హించనున్నట్లు ఉపకులపతి ఆచా ర్య కాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా విశ్వవిద్యాలయాల కుల పతి , తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ ఆచార్య బి ఎస్ మూర్తి హా జరుకానున్నారు. ప్రతిష్టాత్మకమైన స్నాతకోత్సవ నిర్వహణకై నిర్వహిం చిన సన్నాహక సమావేశంలో అ ధ్యాపకులు మరియు బోధనేతర సి బ్బంది కమిటీల ద్వారా నిర్వర్తించా ల్సిన విధులు , బాధ్యతలను ని ర్వ ర్తించాల్సిన వివరించారు.

ఈ స్నాతకోత్సవంలో పీజీ విద్యా ర్థులకు 57 గోల్డ్ మెడల్స్, 22 పిహె చ్డి పట్టాలను అతిధుల చేతుల మీ దుగా అందించనున్నారు. కమిటీ స భ్యులు తమ తమ కార్యకలాపాల ను ప్రారంభించి శ్రద్ధతో నిర్వహించి విశ్వవిద్యాలయ ప్రతిష్ట పెంచేలా కృ షి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య అల్వాల రవి, సి ఓ ఈ డా ఉ పేందర్ రెడ్డి,వివిధ కళాశాలల ప్రి న్సిపాల్ లు, అధికారులు, అధ్యాప కులు బోధనేతర సిబ్బంది పాల్గొ న్నారు.