బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానగంటి మహేష్ గౌడ్
Mahesh Goud : ప్రజా దీవెన నాంపల్లి : 8 తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలు దాడి చేయడం బిజెపి కార్యకర్తలను గాయపరచడం కాంగ్రెస్ పార్టీ పిరికి చర్యగా భావిస్తున్నామని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానుగంటి మహేష్ గౌడ్ అన్నారు ఆయన ప్రజాధీవె న. ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండాలతో దాడి చేయించడం ప్రజాస్వామ్యానికి మచ్చగా భావించాలని అన్నారు బిజెపి కార్యకర్తలపై దాడి చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు బయటపెట్టిందని .
మా కార్యకర్తలు రక్తపు ప్రతిబొట్టుకి మా పోరాటం జవాబు ఇస్తుందని మా కార్యాలయం భవనం కాదు లక్షలాది కార్యకర్తలు కృషి ప్రజలకు సేవ చేసే సంకల్పానికి ప్రతీక అన్నారు కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి దాడి మాకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి అని చెప్పారు దాడిచేసి గుండాలను ప్రభుత్వం వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు రౌడీయిజo తిప్పి కొట్టే శక్తి బిజెపి యువతలో ఉందని చెప్పారు