–బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్
Gandicheruvu Venkanna Goud : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ లకి 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు లో స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18 న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వ ర్యంలో నిర్వహించే బంద్ ని సకల జనులు పాల్గొని విజయవంతం చే యాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగొని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్ పో స్టర్ ఆవిష్కరణలో ముఖ్య అతిథి గా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్ అన్నారు. బుధవారం
స్థానిక క్లాక్ టవర్ సెంటర్ లో బంద్ కి సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆ విష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బీసీ లకి స్థానిక సంస్థల ఎ న్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు క ల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వ హించాలని, కోర్ట్ లలో క్లియర్ చే సిన తర్వాతనే నిర్వహించాలి అని, డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక, కులగణన లెక్క తీసిన తర్వాతమా జనాభా 56 శాతం ఉంటే కేవలం 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన కూడా కొంత మంది ఓర్వలేక పోతు న్నారన్నారు.
మేము ఏమైనా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు అడుగుతున్నా మా అని, కేవలం సర్పంచ్, ఎంపీటీ సీ, వార్డు మెంబర్ లు మాకు ఇస్తుం టే ఓర్వకుండా కోర్ట్ లలో కేసులు వే సి మా నోటీకాడి ముద్దను లాగివే స్తున్నారన్నారు. EWS రిజర్వేషన్లు ఇస్తే మేమేమైన అడ్డుపడ్డమా అని ప్రశ్నించారు.
జీఓ నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో మా రిజర్వేషన్ల జోలికి ఎవ్వరు రావొద్దని, 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్ని కలు నిర్వహించాలని ఈ నెల 18 న బీసీ JAC ఆధ్వర్యంలో నిర్వ హించే బంద్ లో అందరూ పాల్గొని, ఈ బంద్ కి విద్య సంస్థలు, వ్యాపా ర సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆర్టీ సీ, సకల జనులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తండు సైదులు గౌడ్, వైదులసత్యనారాయణ, పం దుల సైదులు గౌడ్, భోనగిరి దేవేం దర్, కట్టెకొల్లు దిపేందర్, ఎమ్మార్పీ ఎస్ బకరం శ్రీనివాస్, దేవయ్య, క ర్నాటి యాదగిరి, చీర పంకజ్ యా దవ్, పాల్వాయి రవి,కట్టెల శివ, కొంపల్లి రామన్న గౌడ్ ,చెనగోని న రేష్, వంశీ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.