Workers General Strike :ప్రజా దీవెన, కోదాడ; కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ సామాన్యులపై భారాలను మోపుతుందని సిమెంట్ క్లస్టర్ పరిశ్రమల వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ వట్టెపు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక కోదాడ పట్టణంలోని అంబికా మార్బుల్స్ & టైల్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో వివిధ మార్పుల్స్ షాపులలో పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు లేవని టైం స్కేల్ లేదని పనిభారం పెంచి ఎగుమతి దిగుమతి రేట్లను తగ్గిస్తున్నారని కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు అన్నారు
కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల స్వదేశీ విదేశీ సంపన్నులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా విదేశీ కార్పోరేటర్లకు అమ్మేస్తుందని వారు ఆవేద వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ వంటి కనీస సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఉద్యమాలు చేస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలపై ఉక్కు పాదం మోపుతుందని వారన్నారు .మే 20న కేంద్ర కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్ లు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని ఈ సమ్మెలో సంఘటిత అసంఘటితరంగా ఉద్యోగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు అన్నారు *సమావేశ అనంతరం యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. యొక్క సమావేశంలో సిఐటియు కోదాడ పట్టణ కార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు, మేస్త్రి రవీందర్ రెడ్డి, యూనియన్ అధ్యక్షులు పి కృష్ణ, శ్రీను, వీరేందర్ ,శ్రీరామ్, ఏసు, రవీందర్, అనిల్, రామయ్య, తదితరులు పాల్గొన్నారు