–భక్తుల కోసం విష్ణు పుష్కరిణిలో అందుబాటులో మల్లన్న
–తిరుమల తరహాలో నిత్యం వెలిగే లా అఖండ దీపారాధన
–గుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న 15వేల మంది భక్తులు
Mallanna Kalyanam: ప్రజా దీవెన యాదాద్రి: యాదగిరి గుట్ట లక్ష్మీనృసింహుడిని (Yadagiri Gutta Lakshminrisimhu) దర్శించు కునే భక్తులకు స్నాన సంకల్పం ఆర్జిత సేవ అందుబాటులోకి వచ్చింది. యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటనకు ముందు కొండపైన ఉన్న గుండంలో భక్తులు స్నానమాచ రించేవారు. ఉద్ఘాటన నేపథ్యంలో భక్తుల స్నానానికి కొండకింద లక్ష్మీ పుష్కరిణిని, (Lakshmi Pushkarini under the hill)కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి నీటిని దేవతా కైంకర్యాలకు వినియోగిస్తున్నారు. కొండపై ఉన్న గుండంలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల్లో అనాదిగా ఉన్న నమ్మకం, పాత ఆచారాల పునరుద్ధరణ నేపథ్యంలో ఆదివారం నుంచి స్నాన సంకల్పం ఆర్జితసేవను ఆలయ అధికారులు అందు బాటులోకి తీసుకొచ్చారు. ఉదయం 9.30కు కొండపైన విష్ణు పుష్క రిణిలో స్నాన సంకల్పం అర్జిత సేవను (Earned service) ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ ఈవో ఏ. భాస్కర్‌రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఐలయ్య కుటుంబసమేతంగా పుష్కరిణిలో స్నాన సంకల్పం చేశారు. భక్తులు కూడా స్నాన సంకల్పంలో భాగస్వాముల య్యారు.
ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా ఈశాన్య దిశలో కొత్తగా ఏర్పాటు చేసిన అఖండ దీపారాధనను కూడా ప్రారంభించారు. తొలిరోజు భక్తులందరికీ ఉచితంగా స్నాన సంకల్పానికి అవకాశం కల్పించారు. దీనికి రూ.100 టికెట్ వసూలు చేయనున్నారు. కాగా లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని యాదగిరికొండ చుట్టూ నిర్వహిం చిన గిరి ప్రదక్షిణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేద మం త్రాల నడుమ ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలతో అర్చక స్వాములు హారతి ఇవ్వగా ఆలయ ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసిం హమూర్తి పాల్గొనగా, ప్రభు త్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిల య్య తన కుటుంబసభ్యులతో కలిసి గిరిప్రదక్షిణ శుభ కార్యాన్ని గోవింద నామస్మరణ (Namasmarana of Govinda)మధ్య ప్రారంభించారు. మొత్తం 15వేల మంది గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.