*ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదాం: మల్లయ్య యాదవ్
Mallaya Yadav : ప్రజా దీవేన, కోదాడ: పోయింది అధికారం మాత్రమే..తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది గులాబీ జెండానే అని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ చింత కవితా రాధారెడ్డి గారి అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతంకోసం నిర్వహించిన సన్నాహక సమావేశం ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ. ఏప్రియల్ 27న తారీకున వరంగల్ లో జరిగే సభకు కోదాడ నియోజకవర్గం నుండి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని ఆయన పిలిపునిచ్చారు.
ఈ సభకు హజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసొల్లా గుండెల్లో రైళ్లు పరుగేత్తాలి అని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చె అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు.ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదాం..భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మాజీ సొసైటీ చైర్మన్ ముత్తవరపు రమేష్, మండల పార్టీ నాయకులు శ్రీకాంత్, బ్రహ్మం గౌడ్, శ్రీనివాస్ యాదవ్, అప్పారావు, వెంకట్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మండలా అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ స్థాయి నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. .