మస్తాన్ మృతి బాధాకరం.
Market Committee Vice Chairman Sheikh Bashir: ప్రజా దీవెన, కోదాడ: ఆపదలో ఉన్న పండ్ల వ్యాపారస్తుల సంఘ సభ్యులను ఆదుకోవడానికి సంఘం అండగా ఉంటుందని ఆ సంఘ గౌరవ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ తెలిపారు. మంగళవారం కోదాడ పట్టణంలో పండ్ల వ్యాపారస్తుడు మస్తాన్ అనారోగ్యంతో వారి నివాసంలో మృతి చెందాడు. కాగా ఈరోజు మృతుని నివాసానికి వెళ్లి మస్తాన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంత్యక్రియల నిమిత్తం ఐదువేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సంఘ అధ్యక్షులు షేక్ షమీఊల్లా, ఇస్మాయిల్, సుభాని, జానీ మియా, సున్ని, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.